సూరా 59 · జుజ్ 28

Al-Hashr · 59:2

هُوَ الَّذِي أَخْرَجَ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ مِنْ دِيَارِهِمْ لِأَوَّلِ الْحَشْرِ ۚ مَا ظَنَنْتُمْ أَنْ يَخْرُجُوا ۖ وَظَنُّوا أَنَّهُمْ مَانِعَتُهُمْ حُصُونُهُمْ مِنَ اللَّهِ فَأَتَاهُمُ اللَّهُ مِنْ حَيْثُ لَمْ يَحْتَسِبُوا ۖ وَقَذَفَ فِي قُلُوبِهِمُ الرُّعْبَ ۚ يُخْرِبُونَ بُيُوتَهُمْ بِأَيْدِيهِمْ وَأَيْدِي الْمُؤْمِنِينَ فَاعْتَبِرُوا يَا أُولِي الْأَبْصَارِ

గ్రంథ ప్రజలలోని సత్యతిరస్కారులను మొదట సమీకరించిన (బనూ నదీర్ తెగ) వారిని, వారి గృహాల నుండి వెళ్లగొట్టినవాడు ఆయనే. వారు వెళ్ళిపోతారని మీరు ఏ మాత్రం భావించలేదు. మరియు అల్లాహ్ నుండి తమను తమ కోటలు తప్పక రక్షిస్తాయని వారు భావించారు! కాని అల్లాహ్ (శిక్ష) వారు ఊహించని వైపు నుండి, వారిపై వచ్చి పడింది. మరియు ఆయన వారి హృదయాలలో భయం కలుగజేశాడు, కావున వారు తమ ఇండ్లను తమ చేతులారా మరియు విశ్వాసుల చేతులతో కూడా, నాశనం చేయించుకున్నారు. కావున ఓ పరిజ్ఞానం (కళ్ళు) గల వారలారా! గుణపాఠం నేర్చుకోండి.

తఫ్సీర్

ఆయనే అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచి,ఆయన ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని తిరస్కరించి బనూ నజీర్ ను మదీనాలో ఉన్న వారి నివాసముల నుండి వారిని మదీనా నుండి షామ్ (సిరియా) వైపునకు మొదటి సారి వెలివేయటం కొరకు వెలివేశాడు. మరియు వారు తౌరాత్ ను కలిగిన యూదుల్లోంచి వారు. వారు తమ ఒప్పందమును భంగపరచి,ఆయనకు వ్యతిరేకముగా ముష్రికులతో సత్సంబంధాలు కలిగిన తరువాత. ఆయన వారిని షామ్ ప్రాంతము వైపునకు వెలివేశాడు. ఓ విశ్వాసపరులారా వారు కలిగిన ఆధిక్యత మరియు రక్షణ వలన వారు తమ నివాసముల నుండి భయటకు వస్తారని మీరు అనుకోలేదు. మరియు వారు నిర్మించుకున్న వారి కోటలు మరియు వారి రక్షణాలయములు అల్లాహ్ యాతన,ఆయన శిక్ష నుండి తమను రక్షిస్తాయని వారు భావించారు. అప్పుడు అల్లాహ్ శిక్ష ఆయన తన ప్రవక్తను వారితో పోరాడమని,వారిని వెలివేయమని ఆదేశించినప్పుడు వారు దాని వచ్చే చోటును ఊహించని విధంగా వారిపై వచ్చిపడినది. మరియు అల్లాహ్ వారి హృదయముల్లో తీవ్రమైన భయమును కలిగించాడు. వారు తమ నివాసములను ముస్లిములు వాటితో ప్రయోజనం చెందకుండా ఉండటానికి లోపలి నుండి తమ చేతులతో పడగొట్టసాగారు. మరియు ముస్లిములు వాటిని వెలుపల నుండి పడగొట్టసాగారు. కాబట్టి కళ్లు ఉన్నవారలారా వారి అవిశ్వాసం వలన వారిపై కలిగిన దాని ద్వారా మీరు గుణపాఠం నేర్చుకోండి. మీరు వారిలా అవ్వకండి. అటువంటప్పుడు వారు శిక్షంచబడిన వారి ప్రతిఫలము,వారి శిక్షను మీరు పొందుతారు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి