సూరా 57 · జుజ్ 27
Al-Hadid · 57:27
ثُمَّ قَفَّيْنَا عَلَىٰ آثَارِهِمْ بِرُسُلِنَا وَقَفَّيْنَا بِعِيسَى ابْنِ مَرْيَمَ وَآتَيْنَاهُ الْإِنْجِيلَ وَجَعَلْنَا فِي قُلُوبِ الَّذِينَ اتَّبَعُوهُ رَأْفَةً وَرَحْمَةً وَرَهْبَانِيَّةً ابْتَدَعُوهَا مَا كَتَبْنَاهَا عَلَيْهِمْ إِلَّا ابْتِغَاءَ رِضْوَانِ اللَّهِ فَمَا رَعَوْهَا حَقَّ رِعَايَتِهَا ۖ فَآتَيْنَا الَّذِينَ آمَنُوا مِنْهُمْ أَجْرَهُمْ ۖ وَكَثِيرٌ مِنْهُمْ فَاسِقُونَ
ఆ తరువాత చాలా మంది ప్రవక్తలను మేము వారి తరువాత పంపాము. మరియు మర్యమ్ కుమారుడు ఈసాను కూడా పంపాము మరియు అతనికి ఇంజీల్ ను ప్రసాదించాము. మరియు అతనిని అనుసరించేవారి హృదయాలలో మేము జాలిని, కరుణను కలిగించాము, కాని సన్యాసాన్ని వారే స్వయంగా కల్పించుకున్నారు. మేము దానిని వారిపై విధించలేదు, కాని అల్లాహ్ ప్రసన్నతను పొందగోరి వారే దానిని విధించుకున్నారు, కాని వారు దానిని పాటించవలసిన విధంగా నిజాయితీతో పాటించలేదు. కావున వారిలో విశ్వసించిన వారికి వారి ప్రతిఫలాన్ని ప్రసాదించాము. కాని వారిలో చాలా మంది అవిధేయులు (ఫాసిఖూన్) ఉన్నారు.
తఫ్సీర్
ఆ తరువాత మేము మా ప్రవక్తలను ఒకరి తరువాత ఒకరిని పంపించాము. మేము వారిని వారి సమాజాల వద్దకు క్రమక్రమంగా పంపాము. మరియు మేము వారి వెనుక మర్యమ్ కుమారుడగు ఈసాను పంపాము. మరియు ఆయనకు మేము ఇంజీలును ప్రసాదించాము. మరియు మేము ఆయనను విశ్వసించి ఆయనను అనుసరించిన వారి హృదయములలో దయను,కరుణను కలిగించాము. అయితే వారు పరస్పరం ప్రేమించుకునే వారు మరియు దయ చూపుకునేవారు. మరియు వారు తమ ధర్మ విషయంలో అతిక్రమించటమును ఆరంభించారు. అప్పుడు వారు అల్లాహ్ వారికి ధర్మ సమ్మతం చేసిన నికాహ్,రుచి కరమైన వస్తువులను కొన్నింటిని వదిలివేశారు. మరియు మేము దాన్ని వారి నుండి కోరలేదు. వారు దాన్ని స్వయంగా తమపై తప్పనిసరి చేసుకున్నారు ; ధర్మంలో వారి తరపు నుండి కొత్తపొకడగా. కాని మేము మాత్రం అల్లాహ్ కు ఇష్టమైన వాటిని కోరాము వారు చేయలేదు. మేము వారిలోంచి విశ్వసించిన వారిని వారి ప్రతిఫలమును ప్రసాదించాము. వారిలో నుండి చాలా మంది ఆయన ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు తీసుకుని వచ్చిన వాటిని తిరస్కరించి అల్లాహ్ విధేయత నుండి వైదొలగిపోయినారు.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి