సూరా 57 · జుజ్ 27

Al-Hadid · 57:20

اعْلَمُوا أَنَّمَا الْحَيَاةُ الدُّنْيَا لَعِبٌ وَلَهْوٌ وَزِينَةٌ وَتَفَاخُرٌ بَيْنَكُمْ وَتَكَاثُرٌ فِي الْأَمْوَالِ وَالْأَوْلَادِ ۖ كَمَثَلِ غَيْثٍ أَعْجَبَ الْكُفَّارَ نَبَاتُهُ ثُمَّ يَهِيجُ فَتَرَاهُ مُصْفَرًّا ثُمَّ يَكُونُ حُطَامًا ۖ وَفِي الْآخِرَةِ عَذَابٌ شَدِيدٌ وَمَغْفِرَةٌ مِنَ اللَّهِ وَرِضْوَانٌ ۚ وَمَا الْحَيَاةُ الدُّنْيَا إِلَّا مَتَاعُ الْغُرُورِ

బాగా తెలుసుకోండి! నిశ్చయంగా, ఇహలోక జీవితం, ఒక ఆట మరియు ఒక వినోదం మరియు ఒక శృంగారం మరియు మీరు పరస్పరం గొప్పలు చెప్పుకోవడం మరియు సంపద మరియు సంతానం విషయంలో ఆధిక్యత పొందటానికి ప్రయత్నించడం మాత్రమే. దాని దృష్టాంతం ఆ వర్షం వలే ఉంది: దాని (వర్షం) వల్ల పెరిగే పైరు రైతులకు ఆనందం కలిగిస్తుంది. ఆ పిదప అది ఎండిపోయి పసుపు పచ్చగా మారిపోతుంది. ఆ పిదప అది పొట్టుగా మారిపోతుంది. కాని పరలోక జీవితంలో మాత్రం (దుష్టులకు) బాధాకరమైన శిక్ష మరియు (సత్పురుషులకు) అల్లాహ్ నుండి క్షమాపణ మరియు ఆయన ప్రసన్నత ఉంటాయి. కావున ఇహలోక జీవితం కేవలం మోసగించే భోగభాగ్యాలు మాత్రమే.

తఫ్సీర్

ఇహలోక జీవితం శరీరములు ఆడుకునే ఒక ఆట అని మరియు హృదయములు వినోదం పొందే ఒక వినోదమని మరియు మీరు అలంకరించుకునే ఒక అలంకరణ అని మీరు తెలుసుకోండి. అందులో ఉన్న అధికారము మరియు ప్రయోజన సామగ్రితో మీరు పరస్పరం గొప్పలు చెప్పుకోవటం మరియు సంపదలు అధికముగా ఉండటం వలన,సంతానము ఎక్కువగా ఉండటం వలన ప్రగల్బాలు పలకటం. ఆ వర్షపు ఉపమానము మాదిరిగా ఉన్నది దాని మొక్కలు రైతులకు ఆనందం కలిగిస్తాయి. ఆ పిదప ఆ పచ్చటి మొక్కలు ఎండిపోకుండా ఉండవు. ఓ చూసే వాడా నీవు దాన్ని పచ్చగా అయిన తరువాత పసుపుగా చూస్తావు. ఆ తరువాత అల్లాహ్ దాన్ని ముక్కలు ముక్కలుగా అయిన పొట్టు వలె చేస్తాడు. మరియు పరలోకములో అవిశ్వాసపరులకు,కపటులకు కఠినమైన శిక్ష కలదు. మరియు అల్లాహ్ వద్ద నుండి విశ్వాసపరులైన తన దాసుల పాపములకు మన్నింపు మరియు ఆయన మన్నత కలదు. మరియు ఇహలోక జీవితం స్థిరత్వం లేని తరగిపోయే సామగ్రి మాత్రమే. ఎవరైతే తరిగి పోయే దాని సామగ్రికి పరలోక అనుగ్రహాలపై ప్రాధాన్యతనిస్తాడో అతడు మోసపోయి నష్టపోయేవాడు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి