సూరా 57 · జుజ్ 27
Al-Hadid · 57:16
۞ أَلَمْ يَأْنِ لِلَّذِينَ آمَنُوا أَنْ تَخْشَعَ قُلُوبُهُمْ لِذِكْرِ اللَّهِ وَمَا نَزَلَ مِنَ الْحَقِّ وَلَا يَكُونُوا كَالَّذِينَ أُوتُوا الْكِتَابَ مِنْ قَبْلُ فَطَالَ عَلَيْهِمُ الْأَمَدُ فَقَسَتْ قُلُوبُهُمْ ۖ وَكَثِيرٌ مِنْهُمْ فَاسِقُونَ
ఏమీ? విశ్వాసుల హృదయాలు అల్లాహ్ ప్రస్తావనతో కృంగిపోయి, ఆయన అవతరింప జేసిన సత్యానికి విధేయులయ్యే సమయం ఇంకా రాలేదా? పూర్వ గ్రంథ ప్రజల్లాగా వారు కూడా మారిపోకూడదు. ఎందుకంటే చాలా కాలం గడిచి పోయినందుకు వారి హృదయాలు కఠినమై పోయాయి. మరియు వారిలో చాలా మంది అవిధేయులు (ఫాసిఖూన్) ఉన్నారు.
తఫ్సీర్
ఏమీ అల్లాహ్ ను,ఆయన ప్రవక్తను విశ్వసించిన వారికి వారి హృదయములు పరిశుద్ధుడైన అల్లాహ్ స్మరణ కొరకు, ఆయన ఖుర్ఆన్ నుండి అవతరింపజేసిన వాగ్దానము,హెచ్చరికల నుండి మృధువుగా,మనశ్శాంతి పొందే సమయం రాలేదా ?. మరియు వారి హృదయములు కఠినంగా మారిపోవటంలో తౌరాత్ ఇవ్వబడిన యూదులు,ఇంజీల్ ఇవ్వబడిన క్రైస్తవుల మాదిరిగా కాకూడదు. వారికి మరియు వారి ప్రవక్తలు పంపించబడటానికి మధ్య చాలా కాలం గడిచిపోయినది అప్పుడు దాని వలన వారి హృదయములు కఠినంగా మారిపోయినవి. వారిలో నుండి చాలా మంది అల్లాహ్ విధేయత నుండి ఆయన పై అవిధేయత వైపునకు వైదొలిగిపోయారు.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి