సూరా 57 · జుజ్ 27
Al-Hadid · 57:14
يُنَادُونَهُمْ أَلَمْ نَكُنْ مَعَكُمْ ۖ قَالُوا بَلَىٰ وَلَٰكِنَّكُمْ فَتَنْتُمْ أَنْفُسَكُمْ وَتَرَبَّصْتُمْ وَارْتَبْتُمْ وَغَرَّتْكُمُ الْأَمَانِيُّ حَتَّىٰ جَاءَ أَمْرُ اللَّهِ وَغَرَّكُمْ بِاللَّهِ الْغَرُورُ
(బయటనున్న కపట విశ్వాసులు) ఇలా అరుస్తారు: "ఏమీ? మేము మీతో పాటు ఉండేవాళ్ళం కాదా?" విశ్వాసులు ఇలా జవాబిస్తారు: "ఎందుకు ఉండలేదు? కానీ వాస్తవానికి మిమ్మల్ని మీరు స్వయంగా పరీక్షకు గురి చేసుకున్నారు. మీరు మా (నాశనం కోసం) వేచి ఉన్నారు. మరియు మీరు (పునరుత్థానాన్ని) సందేహిస్తూ ఉన్నారు మరియు మీ తుచ్ఛమైన కోరికలు మిమ్మల్ని మోస పుచ్చాయి. చివరకు అల్లాహ్ నిర్ణయం వచ్చింది. మరియు ఆ మోసగాడు (షైతాన్) మిమ్మల్ని అల్లాహ్ విషయంలో మోసపుచ్చాడు.
తఫ్సీర్
కపటులు విశ్వాసపరులను ఇలా పలుకుతూ పిలుపునిస్తారు : ఏమీ మేము ఇస్లాం పై,విధేయత చూపటంపై మీతో పాటు లేమా ?! ముస్లిములు వారితో ఇలా పలుకుతారు : ఎందుకు కాదు మీరు మాతో పాటు ఉన్నారు. కాని మీరు మీ మనస్సులను కపటత్వముతో పరీక్షకు గురి చేసుకుని వాటిని నాశనం చేసుకున్నారు. మరియు మీరు విశ్వాసపరుల విషయంలో వారు ఓడిపోతే మీరు మీ అవిశ్వాసమును బహిరంగ పరచాలని నిరీక్షించారు. మరియు విశ్వాసపరులకు అల్లాహ్ సహాయము విషయంలో మరియు మరణాంతరం లేపబడటం విషయంలో మీరు సందేహపడ్డారు. మరియు మీ అబద్దపు ఆశలు మిమ్మల్ని మోసం చేశాయి చివరికి మీరు దానిపై ఉన్న స్థితిలోనే మీకు మరణం వచ్చినది. మరియు షైతాను అల్లాహ్ విషయంలో మిమ్మల్ని మోసం చేశాడు.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి