సూరా 5 · జుజ్ 7

Al-Ma'idah · 5:95

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَقْتُلُوا الصَّيْدَ وَأَنْتُمْ حُرُمٌ ۚ وَمَنْ قَتَلَهُ مِنْكُمْ مُتَعَمِّدًا فَجَزَاءٌ مِثْلُ مَا قَتَلَ مِنَ النَّعَمِ يَحْكُمُ بِهِ ذَوَا عَدْلٍ مِنْكُمْ هَدْيًا بَالِغَ الْكَعْبَةِ أَوْ كَفَّارَةٌ طَعَامُ مَسَاكِينَ أَوْ عَدْلُ ذَٰلِكَ صِيَامًا لِيَذُوقَ وَبَالَ أَمْرِهِ ۗ عَفَا اللَّهُ عَمَّا سَلَفَ ۚ وَمَنْ عَادَ فَيَنْتَقِمُ اللَّهُ مِنْهُ ۗ وَاللَّهُ عَزِيزٌ ذُو انْتِقَامٍ

ఓ విశ్వాసులారా! మీరు ఇహ్రామ్ స్థితిలో ఉన్నప్పుడు వేటాడకండి. మీలో ఎవరైనా బుద్ధిపూర్వకంగా వేట చేస్తే, అతడు చంపిన జంతువుతో సరితూగే ఒక పశువును పరిహారంగా సమర్పించుకోవాలి. దానిని (ఆ పశువును) మీలో న్యాయవర్తులైన ఇద్దరు వ్యక్తులు నిర్ణయించాలి. పశువును ఖుర్బానీ కొరకు కఅబహ్ వద్దకు చేర్చాలి. లేదా దానికి పరిహారంగా కొందరు పేదలకు భోజనం పెట్టాలి, లేదా దానికి పరిహారంగా - తాను చేసిన దాని ప్రతిఫలాన్ని చవిచూడటానికి - ఉపవాసముండాలి. గడిచిపోయిన దానిని అల్లాహ్ మన్నించాడు. కాని ఇక ముందు ఎవరైనా మళ్ళీ అలా చేస్తే అల్లాహ్ అతనికి ప్రతీకారం చేస్తాడు. మరియు అల్లాహ్ సర్వ శక్తి సంపన్నుడు, ప్రతీకారం చేయగలవాడు.

తఫ్సీర్

ఓ విశ్వాసపరులారా మీరు హజ్ లేదా ఉమ్రా ఇహ్రామ్ స్థితిలో ఉన్నప్పుడు వేట జంతువులను చంపకండి.మీలో నుంచి ఎవరైతే ఉద్దేశ్యపూర్వకంగా దానిని చంపితే అతనిపై తాను చంపిన జంతువునకు సమానమైన జంతువు ఒంటె,ఆవు,గొర్రెలో నుంచి పరిహారంగా చెల్లించటం ఆవశ్యం.దాని గురించి ముస్లిముల మధ్య న్యాయవంతులైన ఇద్దరు వ్యక్తులు తీర్పునిస్తారు.వారిద్దరు నిర్ణయించేది చేయాలి.పరిహారంగా ఇచ్చే ఖుర్బానీని మక్కాకు చేరవేసి హరమ్లో దానిని జుబాహ్ చేయాలి లేదా దాని విలువగల భోజనమును హరమ్ ప్రాంతపు పేదవారికి ఏర్పాటు చేయాలి.ప్రతి పేదవానికి సగం సా (1.25కిగ్రా) ఇవ్వాలి లేదా ప్రతి సగం సా కి బదులుగా ఒక రోజు ఉపవాసముండాలి.ఇదంతా వేట జంతువుని చంపిన వ్యక్తి తాను దానిని చంపటానికి ముందడుగు వేసినందుకు శిక్షను అనుభవించటం కొరకు.వేట జంతువును చంపటంను నిషేదించక మునుపు ఇహ్రామ్ వేసుకున్న వ్యక్తి చంపిన దానిని అల్లాహ్ మన్నించి వేశాడు.నిషేదము తరువాత దానిని చేసేవాడిని అల్లాహ్ శిక్షిస్తూ ప్రతీకారం తీసుకుంటాడు.మరియు అల్లహ్ బలవంతుడును,ఆపేవాడును తనపై విధేయత చూపే వారిని తాను తలచుకుంటే ప్రతీకారం తీసుకోవటం అతని శక్తిలోంచే.దాని నుంచి ఎవరు ఆయనను ఆపలేరు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి