సూరా 5 · జుజ్ 7

Al-Ma'idah · 5:90

يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِنَّمَا الْخَمْرُ وَالْمَيْسِرُ وَالْأَنْصَابُ وَالْأَزْلَامُ رِجْسٌ مِنْ عَمَلِ الشَّيْطَانِ فَاجْتَنِبُوهُ لَعَلَّكُمْ تُفْلِحُونَ

ఓ విశ్వాసులారా! నిశ్చయంగా మధ్యపానం, జూదం, బలిపీఠం మీద బలి ఇవ్వటం (అన్సాబ్) మరియు శకునానికై బాణాల ప్రయోగం (అజ్లామ్) ఇవన్నీ కేవలం అసహ్యకరమైన షైతాన్ చేష్టలు, కావున మీరు సాఫల్యం పొందాలంటే వీటిని త్యజించండి.

తఫ్సీర్

ఓ విశ్వాసపరులారా మతిని పోగొట్టే మత్తు పదార్దం (ముస్కిర్),ఇరువైపుల నుండి ప్రత్యామ్నాయాన్ని కలిగి ఉన్న జూదము,విగ్రహారాధకులు జంతువులను బలి ఇవ్వటానికి గౌరవంగా ఏర్పాటు చేసుకున్న లేదా ఆరాధన కోసం పాతిపెట్టుకున్న రాళ్ళు,తమ కోసం నిర్ధారించబడిన అగోచర విషయాలను వేటి ద్వారా నైతే అన్వేషిస్తారో ఆ బాణాలు ఇవన్ని షైతాను అలంకరించిన పాప కార్యాలు.అయితే మీరు గౌరవప్రదమైన జీవితము ద్వారా,పర లోకములో స్వర్గ వనాల అనుగ్రహాల ద్వారా సాఫల్యం పొందటం కొరకు వాటి నుండి దూరంగా ఉండండి.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి