సూరా 5 · జుజ్ 6
Al-Ma'idah · 5:68
قُلْ يَا أَهْلَ الْكِتَابِ لَسْتُمْ عَلَىٰ شَيْءٍ حَتَّىٰ تُقِيمُوا التَّوْرَاةَ وَالْإِنْجِيلَ وَمَا أُنْزِلَ إِلَيْكُمْ مِنْ رَبِّكُمْ ۗ وَلَيَزِيدَنَّ كَثِيرًا مِنْهُمْ مَا أُنْزِلَ إِلَيْكَ مِنْ رَبِّكَ طُغْيَانًا وَكُفْرًا ۖ فَلَا تَأْسَ عَلَى الْقَوْمِ الْكَافِرِينَ
ఇలా అను: "ఓ గ్రంథ ప్రజలారా! మీరు తౌరాత్ ను, ఇంజీల్ ను మరియు మీ ప్రభువు తరఫు నుండి మీపై అవతరింపజేయబడిన దానిని (ఈ ఖుర్ఆన్ ను) ఆచరించనంత వరకు, మీరు అసలు దేని (ఏ సత్యమార్గం) మీద కూడా ఉండనట్లే!" మరియు నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింపజేయబడిన (ఈ గ్రంథం) వాస్తవానికి వారిలోని అనేకుల తలబిరుసుతనాన్ని మరియు సత్యతిరస్కారాన్ని మాత్రమే పెంచుతుంది. కావున నీవు సత్యతిరస్కార ప్రజలను గురించి విచారించకు.
తఫ్సీర్
ఓ ప్రవక్తా మీరు ఇలా తెలియపరచండి : ఓ యూదులు మరియు క్రైస్తవులారా మీరు తౌరాతులో మరియు ఇంజీలులో ఉన్నవాటిని మరియు మీపై అవతరింపబడినటువంటి ఖుర్ఆన్ ను దాన్ని విశ్వసిస్తేనే మరియు దానిలో ఉన్నవాటిని ఆచరిస్తేనే తప్ప మీ విశ్వాసము సరికాదు ఆచరించనంత వరకు మీరు గుర్తించబడిన ధర్మము పై లేరు. మరియు గ్రంధవహుల్లోంచి చాలా మందిని వారికి ఉన్న అసూయ వలన మీ ప్రభువు తరుపు నుండి మీపై అవతరింపబడినది తలబిరుసుతనంపై తలబిరుసుతనాన్ని మరియు అవిశ్వాసంపై అవిశ్వాసమును అధికం చేస్తుంది. కావున మీరు ఈ అవిశ్వాసపరులందరిపై విచారించకండి ఎందుకంటే మిమ్మల్ని అనుసరించే విశ్వాసపరుల్లో వారి అవసరం లేకుండా చేసింది.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి