సూరా 5 · జుజ్ 6

Al-Ma'idah · 5:60

قُلْ هَلْ أُنَبِّئُكُمْ بِشَرٍّ مِنْ ذَٰلِكَ مَثُوبَةً عِنْدَ اللَّهِ ۚ مَنْ لَعَنَهُ اللَّهُ وَغَضِبَ عَلَيْهِ وَجَعَلَ مِنْهُمُ الْقِرَدَةَ وَالْخَنَازِيرَ وَعَبَدَ الطَّاغُوتَ ۚ أُولَٰئِكَ شَرٌّ مَكَانًا وَأَضَلُّ عَنْ سَوَاءِ السَّبِيلِ

ఇలా అను: "ఏమీ? అల్లాహ్ తరఫు నుండి ఎవరికి, దీని కంటే హీనకరమైన ప్రతిఫలం దొరుకుతుందో మీకు తెలుపనా? వారే, ఎవరినైతే అల్లాహ్ శపించాడో (బహిష్కరించాడో) మరియు ఎవరినైతే ఆయన ఆగ్రహానికి గురి అయ్యారో! మరియు వారిలో కొందరు, ఎవరినైతే ఆయన కోతులుగా మరియు పందులుగా మార్చాడో! మరియు వారు ఎవరైతే కల్పిత దైవాల (తాగూత్ ల) దాస్యం చేస్తారో. అలాంటి వారు (పునరుత్థాన దినమున) ఎంతో హీనస్థితిలో ఉంటారు మరియు వారు ఋజుమార్గం నుండి చాలా దూరం వెళ్లి పోయిన వారే!"

తఫ్సీర్

ఓ ప్రవక్తా మీరు ఇలా తెలపండి : వీరందరికన్న ఎవరు ఎక్కువ నిందకు మరియు తీవ్ర శిక్షకు అర్హులో నేను మీకు తెలుపనా. నిశ్చయంగా వారే ఎవరినైతే అల్లాహ్ తన కారుణ్యము నుండి గెంటివేసి వారి రూపాలను మర్చిన తరువాత కోతులుగా పందులుగా మార్చి వేశాడో మరియు వారిలో నుండి కొందరిని తాగూత్ లకు దాస్యం చేసే వారిగా చేశాడో, అల్లాహ్ ను వదిలి ఇష్టతతో ఎవరి ఆరాధన చేయబడునో దాన్ని తాగూత్ అంటారు. ఈ ప్రస్తావించబడిన వారందరు ప్రళయదినమున చెడ్డ స్థానము కలవారు మరియు ఋజుమార్గము నుండి తప్పిపోయిన వారు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి