సూరా 5 · జుజ్ 6
Al-Ma'idah · 5:22
قَالُوا يَا مُوسَىٰ إِنَّ فِيهَا قَوْمًا جَبَّارِينَ وَإِنَّا لَنْ نَدْخُلَهَا حَتَّىٰ يَخْرُجُوا مِنْهَا فَإِنْ يَخْرُجُوا مِنْهَا فَإِنَّا دَاخِلُونَ
(అప్పుడు) వారన్నారు: "ఓ మూసా! నిశ్చయంగా, అందులో బలిష్ఠులైన ప్రజలు (అమాలేకీయులు) ఉన్నారు. మరియు వారు అక్కడి నుండి వెళ్ళిపోనంత వరకు, మేము అందులో ఏ మాత్రమూ ప్రవేశించము; ఒకవేళ వారు వెళ్ళిపోతే మేము తప్పక ప్రవేశిస్తాము."
తఫ్సీర్
ఆయనతో ఆయన జాతి వారు ఇలా పలికారు : ఓ మూసా నిశ్చయంగా పవిత్ర ప్రదేశములో బలం కల,తీవ్ర పరాక్రమ వంతులైన జాతివారు ఉన్నారు. మరియు ఇది మమ్మల్ని అందులో ప్రవేశించటం నుండి ఆపుతుంది. వారందరు అందులో ఉన్నంతవరకు మేము అందులో ప్రవేశించము. ఎందుకంటే మాకు వారితో పోరాడే ఎటువంటి శక్తి సామర్ధ్యాలు లేవు. ఒక వేళ వారు అక్కడ నుండి వెళ్లిపోతే మేము అందులే ప్రవేశిస్తాము.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి