సూరా 5 · జుజ్ 6

Al-Ma'idah · 5:17

لَقَدْ كَفَرَ الَّذِينَ قَالُوا إِنَّ اللَّهَ هُوَ الْمَسِيحُ ابْنُ مَرْيَمَ ۚ قُلْ فَمَنْ يَمْلِكُ مِنَ اللَّهِ شَيْئًا إِنْ أَرَادَ أَنْ يُهْلِكَ الْمَسِيحَ ابْنَ مَرْيَمَ وَأُمَّهُ وَمَنْ فِي الْأَرْضِ جَمِيعًا ۗ وَلِلَّهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَمَا بَيْنَهُمَا ۚ يَخْلُقُ مَا يَشَاءُ ۚ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ

"నిశ్చయంగా, మర్యమ్ కుమారుడైన మసీహ్ (క్రీస్తు) యే అల్లాహ్!" అని అనే వారు నిస్సందేహంగా! సత్య తిరస్కారులు. (ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: "అల్లాహ్ గనక మర్యమ్ కుమారుడైన మసీహ్ (క్రీస్తు) ను అతని తల్లిని మరియు భూమిపై ఉన్న వారందరినీ, నాశనం చేయగోరితే, ఆయనను ఆపగల శక్తి ఎవరికి ఉంది? మరియు ఆకాశాలలోను, భూమిలోను మరియు వాటి మధ్య ఉన్న సమస్తం మీద ఆధిపత్యం అల్లాహ్ దే. ఆయన తాను కోరినది సృష్టిస్తాడు. మరియు అల్లాహ్ ప్రతిదీ చేయ గల సమర్ధుడు."

తఫ్సీర్

"నిశ్చయంగా క్రైస్తవుల్లోంచి, మర్యమ్ కుమారుడైన మసీహ్ ఈసా యే అల్లాహ్!" అని అనే వారు అవిశ్వాసమునకు ఒడిగట్టారు. ఓ ప్రవక్తా మీరు వారితో ఇలా పలకండి :- మర్యమ్ కుమారుడగు మసీహ్ ఈసాను తుదిముట్టించటం నుండి మరియు ఆయన తల్లిని తుది ముట్టించటం నుండి మరియు భూమిపై ఉన్న వారందరిని తుదిముట్టించటం నుండి అల్లాహ్ వారిని తుదిముట్టించదలచినప్పుడు అల్లాహ్ను ఆపే శక్తి ఎవరికి ఉన్నది ?. మరియు ఎవరికి దాని నుండి ఆయనను ఆపే శక్తి లేనప్పుడు అది అల్లాహ్ తప్ప వాస్తవ ఆరాధ్య దైవము ఎవరూ లేరని మరియు మర్యమ్ కుమారుడగు ఈసా మరియు ఆయన తల్లి మరియు సమస్త సృష్టి అందరు అల్లాహ్ సృష్టి అన్న దానికి ఆధారము. మరియు భూమ్యాకాశముల రాజ్యాధికారము మరియు వాటి మధ్య ఉన్న దాని రాజ్యాధికారము అల్లాహ్ కే చెందుతుంది. ఆయన తాను తలచుకున్న వారిని సృష్టిస్తాడు. ఆయన తలచి సృష్టించిన వారిలో నుంచి ఈసా అలైహిస్సలాం ఉన్నారు. అతను ఆయన దాసుడు మరియు ఆయన ప్రవక్త. మరియు అల్లాహ్ ప్రతీది చేసే సామర్ధ్యం కలవాడు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి