సూరా 5 · జుజ్ 7
Al-Ma'idah · 5:104
وَإِذَا قِيلَ لَهُمْ تَعَالَوْا إِلَىٰ مَا أَنْزَلَ اللَّهُ وَإِلَى الرَّسُولِ قَالُوا حَسْبُنَا مَا وَجَدْنَا عَلَيْهِ آبَاءَنَا ۚ أَوَلَوْ كَانَ آبَاؤُهُمْ لَا يَعْلَمُونَ شَيْئًا وَلَا يَهْتَدُونَ
మరియు వారితో: "అల్లాహ్ అవతరింప జేసిన దాని (సందేశం) వైపునకు మరియు ప్రవక్త వైపునకు రండి." అని పిలిచినప్పుడు! వారు: "మా తండ్రితాతలు అవలంబిస్తూ ఉండగా మేము చూసిన (మార్గమే) మాకు చాలు!" అని జవాబిస్తారు. ఏమీ? వారి తండ్రితాతలకు ఏమీ తెలియకున్నా మరియు వారు సన్మార్గం మీద లేకున్నా (వారి మార్గాన్నే వీరు అనుసరిస్తారా)?
తఫ్సీర్
జంతువుల్లోంచి కొన్ని జంతువులను నిషేధించుకోవటం వలన అల్లాహ్ పై అబద్దమును అంటగట్టిన వీరందరితో మీరు హలాల్,హరాంను తెలుసుకోవటం కొరకు అల్లాహ్ అవతరింపజేసిన ఖుర్ఆన్,ప్రవక్తగారి సున్నత్ వైపునకు తరలి రండి అని అన్నప్పుడు వారు మన పూర్వికులనుండి వారసత్వంగా పొందినవి,విశ్వాసాలు,మాటలు,కార్యాలు మనకు చాలు అని సమాధానమిచ్చారు.అవి వారికి ఎలా తగును.వాస్తవానికి వారి పూర్వికులందరికి ఏమి తెలియదు.వారికి సత్యమేదో తెలియదు.వారిని వారిలోంచి అందరికంటే ఎక్కువ అజ్ఞానులు,మార్గభ్రష్టులు మాత్రమే అనుసరిస్తారు.అయితే వారందరు అజ్ఞానులు,సన్మార్గము నుండి తప్పినవారు.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి