సూరా 48 · జుజ్ 26
Al-Fath · 48:26
إِذْ جَعَلَ الَّذِينَ كَفَرُوا فِي قُلُوبِهِمُ الْحَمِيَّةَ حَمِيَّةَ الْجَاهِلِيَّةِ فَأَنْزَلَ اللَّهُ سَكِينَتَهُ عَلَىٰ رَسُولِهِ وَعَلَى الْمُؤْمِنِينَ وَأَلْزَمَهُمْ كَلِمَةَ التَّقْوَىٰ وَكَانُوا أَحَقَّ بِهَا وَأَهْلَهَا ۚ وَكَانَ اللَّهُ بِكُلِّ شَيْءٍ عَلِيمًا
సత్యాన్ని తిరస్కరించినవారు, తమ హృదయాలలోని మూఢ అభిమానం వల్ల, మూర్ఖపు పట్టు వహించినప్పుడు, అల్లాహ్! తన సందేశహరుని మీద మరియు విశ్వాసుల మీద, శాంతిని అవతరింప జేశాడు. మరియు వారిలో దైవభీతిని స్థిర పరిచాడు. మరియు వారే దానికి హక్కుదారులు మరియు అర్హులు కూడాను. మరియు అల్లాహ్ కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు.
తఫ్సీర్
అల్లాహ్ పట్ల మరియు ఆయన ప్రవక్త పట్ల అవిశ్వాసమును కనబరచిన వారు తమ హృదయముల్లో సత్య సాక్షాత్కారానికి సంబంధం లేకుండా కేవలం మనోవంఛలతో సంబంధం కల అజ్ఞాన కాలపు అహంభావమును పెంచుకున్నప్పుడు వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవేశమును వారు తమను ఓడించి అపనిందలు వేస్తారనే భయముతో అసహ్యించుకున్నారు. అప్పుడు అల్లాహ్ తన వద్ద నుండి మనశ్శాంతిని తన ప్రవక్తపై అవతరింపజేశాడు మరియు దాన్ని విశ్వాసపరులపై అవతరింపజేశాడు. అయితే వారి మీద ఉన్న కోపము ముష్రికులతో పోరాటమును వారు చేసినట్లుగా కోరలేదు. మరియు అల్లాహ్ విశ్వాసపరులకి సత్య వాక్కు అది లా యిలాహ ఇల్లల్లాహ్ (అల్లాహ్ తప్ప వాస్తవ ఆరాధ్య దైవము ఇంకొకరు లేడు) ను అనివార్యము చేశాడు. మరియు వారు దానికి తగినట్లుగా స్థిరంగా ఉండాలని అనివార్యము చేశాడు. అప్పుడు వారు దానిపై స్థిరంగా ఉన్నారు. మరియు విశ్వాసపరులు ఇతరులకన్న ఈ వాక్యమునకు ఎక్కువ హక్కుదారులు. అల్లాహ్ వారి హృదయముల్లో మంచితనమును తెలుసుకున్నప్పుడు వారే దానికి అర్హతకలిగే అర్హులు. మరియు అల్లాహ్ ప్రతీది తెలిసిన వాడు. ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి