సూరా 48 · జుజ్ 26

Al-Fath · 48:10

إِنَّ الَّذِينَ يُبَايِعُونَكَ إِنَّمَا يُبَايِعُونَ اللَّهَ يَدُ اللَّهِ فَوْقَ أَيْدِيهِمْ ۚ فَمَنْ نَكَثَ فَإِنَّمَا يَنْكُثُ عَلَىٰ نَفْسِهِ ۖ وَمَنْ أَوْفَىٰ بِمَا عَاهَدَ عَلَيْهُ اللَّهَ فَسَيُؤْتِيهِ أَجْرًا عَظِيمًا

(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, (నీ చేతిలో చేయి వేసి) నీతో శపథం చేసేవారు, వాస్తవానికి అల్లాహ్ తో శపథం చేస్తున్నారు. అల్లాహ్ చెయ్యి వారి చేతుల మీద ఉంది. ఇక ఎవడు (తన శపథాన్ని) భంగం చేస్తాడో, వాస్తవానికి అతడు తన నష్టం కొరకే తన శపథాన్ని భంగం చేస్తాడు. మరియు ఎవడు తన వాగ్దానాన్ని పూర్తి చేస్తాడో, అల్లాహ్ అతనికి గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాడు.

తఫ్సీర్

ఓ ప్రవక్తా నిశ్చయంగా ముష్రికులైన మక్కా వాసులతో యుద్దం చేయటం విషయంలో మీతో బైఅతె రిజ్వాన్ శపథం చేసినవారు అల్లాహ్ తో శపథం చేసినవారు. ఎందుకంటే ఆయనే ముష్రికులతో యుద్దం చేయమని వారిని ఆదేశించాడు. మరియు ఆయనే వారికి ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. శపథం సమయంలో అల్లాహ్ చేయి వారి చేతులపై ఉన్నది. మరియు ఆయన వారి గురించి తెలుసుకునేవాడు ఆయనపై వారి నుండి ఏదీ గోప్యంగా ఉండదు. అయితే ఎవరైతే తన శపథమును భంగపరచి అల్లాహ్ తో ఆయన ధర్మమునకు సహాయము చేస్తానని చేసిన వాగ్దానమును పూర్తి చేయలేదో నిశ్చయంగా అతని శపథమును అతను భంగపరచిన దాని నష్టము మరియు తన ప్రమాణమును భంగపరచిన దాని నష్టము అతనిపైనే మరలుతుంది. అది అల్లాహ్ కు నష్టం కలిగించదు. మరియు ఎవరైతే అల్లాహ్ తో ఆయన ధర్మమునకు సహాయం చేస్తానని చేసిన వాగ్దానమును పూర్తి చేస్తాడో అతనికి ఆయన తొందరలోనే గొప్ప ప్రతిఫలమును ప్రసాదిస్తాడు. అది స్వర్గము.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి