సూరా 47 · జుజ్ 26
Muhammad · 47:12
إِنَّ اللَّهَ يُدْخِلُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ جَنَّاتٍ تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ ۖ وَالَّذِينَ كَفَرُوا يَتَمَتَّعُونَ وَيَأْكُلُونَ كَمَا تَأْكُلُ الْأَنْعَامُ وَالنَّارُ مَثْوًى لَهُمْ
నిశ్చయంగా, అల్లాహ్! విశ్వసించి సత్కార్యాలు చేసేవారిని స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. వాటి క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. మరియు సత్యాన్ని తిరస్కరించి భోగభాగ్యాలలో మునిగి ఉండి పశువుల మాదిరిగా తింటున్న వారి నివాసం నరకాగ్నియే అవుతుంది.
తఫ్సీర్
నిశ్ఛయంగా అల్లాహ్ పై మరియు ఆయన ప్రవక్తపై విశ్వాసమును కనబరచి సత్కర్మలు చేసేవారిని అల్లాహ్ స్వర్గ వనముల్లో ప్రవేశింపజేస్తాడు వాటి భవనములు,వాటి వృక్షముల క్రింది నుండి సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. మరియు అల్లాహ్ పై,ఆయన ప్రవక్తపై అవిశ్వాసమును కనబరచినవారు ఇహలోకములో తమ మనోవాంఛలను అనుసరించి భోగబాగ్యాల్లో మునిగి ఉన్నారు. మరియు పశువులు తినే మాదిరిగా తింటున్నారు. వారి కడుపులు మరియు వారి మర్మాంగములు తప్ప వారికి ఎటువంటి ఉద్దేశము లేదు. ప్రళయదినమున అగ్నియే వారి నివాస స్థలము,అందులోనే వారు శరణు తీసుకుంటారు.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి