సూరా 46 · జుజ్ 26
Al-Ahqaf · 46:21
۞ وَاذْكُرْ أَخَا عَادٍ إِذْ أَنْذَرَ قَوْمَهُ بِالْأَحْقَافِ وَقَدْ خَلَتِ النُّذُرُ مِنْ بَيْنِ يَدَيْهِ وَمِنْ خَلْفِهِ أَلَّا تَعْبُدُوا إِلَّا اللَّهَ إِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيمٍ
మరియు జ్ఞాపకం చేసుకోండి, ఆద్ జాతి సోదరుడు (హూద్) ఇసుక దిబ్బలలో ఉన్న తన జాతి వారిని హెచ్చరించింది మరియు అలా హెచ్చరించేవారు అతనికి పూర్వం కూడా వచ్చారు మరియు అతని తరువాత కూడా వచ్చారు. (అతను ఇలా అన్నాడు): "మీరు అల్లాహ్ ను తప్ప ఇతరులను ఆరాధించకండి. (అలా చేస్తే) నిశ్చయంగా, ఆ గొప్ప దినమున మీపై పడబోయే, ఆ శిక్షను గురించి నేను భయపడుతున్నాను."
తఫ్సీర్
ఓ ప్రవక్తా మీరు బంధములో ఆద్ సోదరుడైన హూద్ అలైహిస్సలాం తన జాతివారిని వారిపై వాటిల్లే శిక్ష గురించి హెచ్చరించినప్పటి వైనమును జ్ఞప్తికి తెచ్చుకోండి. మరియు వారు అరేబియా ద్వీపకల్పం యొక్క దక్షిణప్రాంతంలో తమ ఇళ్లల్లో ఉన్నారు. వాస్తవానికి హూద్ కన్న ముందు మరియు ఆయన తరువాత ప్రవక్తలు తమ జాతి వారిని హెచ్చరిస్తూ వారితో ఇలా పలుకుతూ గతించారు : మీరు ఒక్కడైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి. మరియు మీరు ఆయనతో పాటు ఇతరులను ఆరాధించకండి. ఓ నా జాతి వారా నిశ్చయంగా నేను మీ గురించి గొప్ప దినమైన ప్రళయదిన శిక్ష గురించి భయపడుతున్నాను.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి