సూరా 46 · జుజ్ 26

Al-Ahqaf · 46:10

قُلْ أَرَأَيْتُمْ إِنْ كَانَ مِنْ عِنْدِ اللَّهِ وَكَفَرْتُمْ بِهِ وَشَهِدَ شَاهِدٌ مِنْ بَنِي إِسْرَائِيلَ عَلَىٰ مِثْلِهِ فَآمَنَ وَاسْتَكْبَرْتُمْ ۖ إِنَّ اللَّهَ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ

వారిలో ఇలా అను: "ఇది (ఈ ఖుర్ఆన్) ఒకవేళ అల్లాహ్ తరఫు నుండి వచ్చి ఉండి, మీరు దీనిని తిరస్కరిస్తూ ఉండినట్లయితే (మీ గతి ఏమవుతుందో) మీరు ఆలోచించరా? ఇస్రాయీల్ సంతతికి చెందిన ఒక సాక్షి ఇది (ఈ ఖుర్ఆన్) దాని (తౌరాత్) లాంటి గ్రంథమేనని, సాక్ష్యం ఇచ్చాడు మరియు విశ్వసించాడు కూడా. కాని మీరేమో అహంభావానికి గురి అయ్యారు. నిశ్చయంగా, అల్లాహ్ దుర్మార్గులకు మార్గదర్శకత్వం చేయడు."

తఫ్సీర్

ఓ ప్రవక్తా ఈ తిరస్కారులందరితో ఇలా పలకండి : మీరు నాకు చెప్పండి ఒక వేళ ఈ ఖుర్ఆన్ అల్లాహ్ వద్ద నుండి అయ్యి వుండి,మీరు దాన్ని తిరస్కరించి ఉండి,బనీ ఇస్రాయీల్ నుండి ఒక సాక్ష్యం పలికే వాడు దాని విషయంలో తౌరాత్ లో వచ్చిన దాన్ని నమ్ముతూ అది అల్లాహ్ వద్ద నుండి వచ్చినదని సాక్ష్యం పలికి,దానిపై అతను విశ్వాసమును కనబరచి ఉండి మరియు మీరు దానిపై విశ్వాసమును కనబరచటం నుండి అహంకారమును చూపితే అప్పుడు మీరు దుర్మార్గులు కారా ?! నిశ్చయంగా అల్లాహ్ దుర్మార్గ ప్రజలకు సత్యము కొరకు సౌభాగ్యం కలిగించడు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి