సూరా 45 · జుజ్ 25

Al-Jathiyah · 45:8

يَسْمَعُ آيَاتِ اللَّهِ تُتْلَىٰ عَلَيْهِ ثُمَّ يُصِرُّ مُسْتَكْبِرًا كَأَنْ لَمْ يَسْمَعْهَا ۖ فَبَشِّرْهُ بِعَذَابٍ أَلِيمٍ

అతడు తన ముందు పఠించబడే అల్లాహ్ సూచనలను (ఆయాత్ లను) వింటున్నాడు ఆ తరువాత మూర్ఖపు పట్టుతో దురహంకారంతో వాటిని విననట్లు వ్యవహరిస్తున్నాడు. కావున అతనికి బాధాకరమైన శిక్ష పడనున్నదనే వార్తను వినిపించు.

తఫ్సీర్

ఈ అవిశ్వాసపరుడు తనకు చదివి వినిపించబడిన ఖుర్ఆన్ లోని అల్లాహ్ ఆయతులను వినేవాడు. ఆ తరువాత అతడు తాను ఉన్న అవిశ్వాసము,పాపకార్యములోనే కొనసాగేవాడు,సత్యమును అనుసరించటం నుండి తన మనస్సులో అహంకారమును కలిగిన వాడు. ఎలాగంటే తనకు చదివి వినిపించబడిన ఈ ఆయతులను అతడు విననట్లుగా ఉన్నాడు. ఓ ప్రవక్త మీరు అతనికి అతని పరలోకంలో అతనికి బాధ కలిగించే దాని గురించి సమాచారమివ్వండి. మరియు అది బాధాకరమైన శిక్ష అందులో అతని కొరకు నిరీక్షిస్తుంది.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి