సూరా 45 · జుజ్ 25
Al-Jathiyah · 45:5
وَاخْتِلَافِ اللَّيْلِ وَالنَّهَارِ وَمَا أَنْزَلَ اللَّهُ مِنَ السَّمَاءِ مِنْ رِزْقٍ فَأَحْيَا بِهِ الْأَرْضَ بَعْدَ مَوْتِهَا وَتَصْرِيفِ الرِّيَاحِ آيَاتٌ لِقَوْمٍ يَعْقِلُونَ
మరియు రేయింబవళ్ళ అనుక్రమంలో మరియు అల్లాహ్ ఆకాశం నుండి జీవనోపాధిని (వర్షాన్ని) పంపి, దాని ద్వారా భూమికి దాని మరణం తర్వాత, తిరిగి జీవం పోయటంలో మరియు వాయువుల మారటంలోనూ బుద్ధిమంతులకు ఎన్నో సూచనలు ఉన్నాయి.
తఫ్సీర్
రాత్రింబవళ్ళను ఒక దాని వెనుక ఒకటిని తీసుకుని రావటంలో, అల్లాహ్ ఆకాశము నుండి వర్షమును కురిపించి దాని ద్వారా భూమిని అందులో ఎటువంటి మొక్కలు లేకుండా మృతునిగా ఉన్న తరువాత అందులో మొలకెత్తించి జీవింపజేయటంలో మరియు గాలులను మీ ప్రయోజనముల కొరకు వాటిని ఒకసారి ఒక దిశ నుండి మరోకసారి ఇంకొ దిశ నుండి తీసుకుని వచ్చి వ్యాపింపజేయటంలో బుద్ధి కల జనుల కొరకు సూచనలు కలవు. అప్పుడు వారు వాటితో అల్లాహ్ ఏకత్వముపై,మరణాంతరం లేపటంపై ఆయన సామర్ధ్యంపై మరియు ప్రతీది చేసే ఆయన సామర్ధ్యం పై ఆధారమును చూపుతారు.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి