సూరా 45 · జుజ్ 25
Al-Jathiyah · 45:34
وَقِيلَ الْيَوْمَ نَنْسَاكُمْ كَمَا نَسِيتُمْ لِقَاءَ يَوْمِكُمْ هَٰذَا وَمَأْوَاكُمُ النَّارُ وَمَا لَكُمْ مِنْ نَاصِرِينَ
మరియు వారితో ఇలా అనబడుతుంది: "ఈ రోజు మేము మిమ్మల్ని మరచి పోతాము, ఏ విధంగానైతే మీరు మీ సమావేశపు ఈ దినాన్ని మరచిపోయారో! మరియు మీ నివాసం నరకాగ్నియే మరియు మీకు సహాయపడేవారు ఎవ్వరూ ఉండరు."
తఫ్సీర్
మరియు అల్లాహ్ వారితో ఇలా పలుకుతాడు : ఈ రోజు మేము మిమ్మల్ని నరకాగ్నిలో వదిలివేస్తాము ఏ విధంగానైతే మీరు మీ ఈదినపు సమావేశమును మరచిపోయి విశ్వాసము,సత్కర్మ ద్వారా దాని కొరకు సిద్ధం కాలేదో ఆ విధంగా. మరియు మీరు శరణం తీసుకునే మీ నివాస స్థలము నరకాగ్నియే. మరియు అల్లాహ్ శిక్షను మీ నుండి తొలగించే సహాయకులు మీ కొరకు ఉండరు.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి