సూరా 45 · జుజ్ 25
Al-Jathiyah · 45:13
وَسَخَّرَ لَكُمْ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ جَمِيعًا مِنْهُ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِقَوْمٍ يَتَفَكَّرُونَ
మరియు ఆయన ఆకాశాలలో మరియు భూమిలోనున్న సమస్తాన్ని, తన అనుగ్రహంతో మీకు ఉపయుక్తంగా చేశాడు. నిశ్చయంగా, ఇందులో ఆలోచించే వారికి ఎన్నో సూచనలు (ఆయాత్) ఉన్నాయి.
తఫ్సీర్
మరియు పరిశుద్ధుడైన ఆయన ఆకాశములో ఉన్న సూర్యుడిని,చంద్రుడిని,నక్షత్రములను మరియు భూమిలో ఉన్న కాలువలను,వృక్షములను,పర్వతములను మరియు మొదలగువాటిని మీ కొరకు ఉపయుక్తంగా చేశాడు. నిశ్ఛయంగా వాటిని మీకు ఉపయుక్తంగా చేయటంలో అల్లాహ్ సూచనల్లో యోచన చేసేవారి కొరకు అల్లాహ్ సామర్ధ్యంపై,ఆయన ఏకత్వం పై సూచించే సూచనలు కలవు. కావున వారు వాటితో గుణపాఠం నేర్చుకుంటారు.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి