సూరా 40 · జుజ్ 24
Ghafir · 40:77
فَاصْبِرْ إِنَّ وَعْدَ اللَّهِ حَقٌّ ۚ فَإِمَّا نُرِيَنَّكَ بَعْضَ الَّذِي نَعِدُهُمْ أَوْ نَتَوَفَّيَنَّكَ فَإِلَيْنَا يُرْجَعُونَ
కావున (ఓ ప్రవక్తా!) నీవు సహనం వహించు! నిశ్చయంగా, అల్లాహ్ వాగ్దానం సత్యం. మేము వారికి చేసిన వాగ్దానాల (శిక్ష) నుండి కొంత నీకు చూపినా! లేదా (దానికి ముందు) నిన్ను మరణింపజేసినా వారందరూ మా వైపునకే కదా మరలింపబడతారు!
తఫ్సీర్
ఓ ప్రవక్తా మీరు మీ జాతివారు బాధించిన దానిపై మరియు వారి తిరస్కారముపై సహనం చూపండి. నిశ్చయంగా మీకు సహాయం చేసే అల్లాహ్ వాగ్దానం సత్యము అందులో ఎటువంటి సందేహం లేదు. ఏ విధంగానైతే బదర్ దినమున సంభవించినదో అలా మీరు జీవించి ఉన్నప్పుడే వారికి మేము వాగ్దానం చేసిన శిక్ష లో నుండి కొంత భాగమును మీకు చూపించినా లేదా దాని కన్న ముందు మేము మీకు మరణమును కలిగించినా వారు ప్రళయదినమున మా ఒక్కరి వైపునకే మరలుతారు. అప్పుడు మేము వారికి వారి కర్మలపరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాము. అప్పుడు మేము వారందరిని నరకములో శాశ్వతంగా ఉండేవిధంగా ప్రవేశింపజేస్తాము.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి