సూరా 40 · జుజ్ 24
Ghafir · 40:67
هُوَ الَّذِي خَلَقَكُمْ مِنْ تُرَابٍ ثُمَّ مِنْ نُطْفَةٍ ثُمَّ مِنْ عَلَقَةٍ ثُمَّ يُخْرِجُكُمْ طِفْلًا ثُمَّ لِتَبْلُغُوا أَشُدَّكُمْ ثُمَّ لِتَكُونُوا شُيُوخًا ۚ وَمِنْكُمْ مَنْ يُتَوَفَّىٰ مِنْ قَبْلُ ۖ وَلِتَبْلُغُوا أَجَلًا مُسَمًّى وَلَعَلَّكُمْ تَعْقِلُونَ
ఆయనే, మిమ్మల్ని మట్టితో సృష్టించాడు. తరువాత వీర్యబిందువుతో, ఆ తరువాత పిండంతో (రక్తముద్దతో), ఆ తరువాత మిమ్మల్ని శిశువు రూపంలో బయటికి తీస్తాడు. ఆ తరువాత మిమ్మల్ని యుక్తవయస్సులో బలం గలవారిగా చేస్తాడు; చివరకు మిమ్మల్ని ముసలివారిగా మార్చుతాడు. మీలో కొందరు దీనికి ముందే చనిపోతారు. మరియు మీరంతా మీ నియమిత కాలం వరకే నివసిస్తారు. బహుశా మీరు అర్థం చేసుకుంటారని (ఇదంతా మీకు వివరించబడుతోంది).
తఫ్సీర్
ఆయనే మీ తండ్రి అయిన ఆదమ్ ను మట్టితో సృష్టించాడు. మరల ఆయన మిమ్మల్ని దాని తరువాత వీర్యబిందువుతో ఆ పిదప వీర్య బిందువు తరువాత రక్తపు గడ్డతో మిమ్మల్ని సృష్టించాడు. దాని తరువాత ఆయన మిమ్మల్ని మీ తల్లుల గర్భముల నుండి చిన్న పిల్లలుగా వెలికి తీస్తాడు. ఆ తరువాత మీరు దృఢమైన శరీరములు కల వయసుకు చేరుకుని ఆ తరువాత మీరు పెద్దవారై వృద్ధులయ్యే వరకు (మిమ్మల్ని పెంచుతాడు). మరియు మీలో నుండి కొందరు దాని కన్న ముందే చనిపోయేవారున్నారు. మరియు (ఆయన మిమ్మల్ని వదిలేస్తాడు) మీరు అల్లాహ్ జ్ఞానంలో నిర్ణీత కాలమునకు చేరుకోవటానికి. మీరు దాని నుండి తగ్గించలేరు. మరియు మీరు దానికన్న పెంచలేరు. మరియు బహుశ మీరు ఆయన సామర్ధ్యంపై,ఆయన ఏకత్వంపై సూచించే ఈ వాదనలు,ఆధారల ద్వారా ప్రయోజనం చెందుతారని.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి