సూరా 40 · జుజ్ 24
Ghafir · 40:46
النَّارُ يُعْرَضُونَ عَلَيْهَا غُدُوًّا وَعَشِيًّا ۖ وَيَوْمَ تَقُومُ السَّاعَةُ أَدْخِلُوا آلَ فِرْعَوْنَ أَشَدَّ الْعَذَابِ
ఆ నరకాగ్ని! వారు దాని యెదుటకు ఉదయమూ మరియు సాయంత్రమూ రప్పింపబడుతూ ఉంటారు. మరియు (పునరుత్థాన) దినపు ఘడియ వచ్చినపుడు: "ఫిర్ఔన్ జనులను తీవ్రమైన శిక్షలో పడవేయండి!" అని ఆజ్ఞ ఇవ్వబడుతుంది.
తఫ్సీర్
వారి మరణం తరువాత వారు వారి సమాదులలో దినము మొదటి వేళలో మరియు దాని చివరి వేళలో నరకాగ్నిపై ప్రవేశపెట్టబడుతారు. మరియు ప్రళయదినమున ఇలా అనబడుతుంది : ఫిర్ఔన్ ను అనుసరించేవారిని వారు పాల్పడిన అవిశ్వాసము,తిరస్కారము మరియు అల్లాహ్ మార్గము నుండి ఆపటం వలన తీవ్రమైన మరియు పెద్దదైన శిక్షలో ప్రవేశింపజేయండి.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి