సూరా 40 · జుజ్ 24
Ghafir · 40:40
مَنْ عَمِلَ سَيِّئَةً فَلَا يُجْزَىٰ إِلَّا مِثْلَهَا ۖ وَمَنْ عَمِلَ صَالِحًا مِنْ ذَكَرٍ أَوْ أُنْثَىٰ وَهُوَ مُؤْمِنٌ فَأُولَٰئِكَ يَدْخُلُونَ الْجَنَّةَ يُرْزَقُونَ فِيهَا بِغَيْرِ حِسَابٍ
దుష్కార్యాలు చేసిన వానికి, వాటికి సరిపోయే ప్రతీకారం మాత్రమే లభిస్తుంది. మరియు విశ్వసించి సత్కార్యాలు చేసేవాడు, పురుషుడైనా లేదా స్త్రీ అయినా! అతడు (ఆమె) విశ్వాసి అయితే; అలాంటి వారు స్వర్గంలో ప్రవేశిస్తారు. అందు వారికి అపరిమితమైన జీవనోపాధి ఇవ్వబడుతుంది.
తఫ్సీర్
దుష్కర్మకు పాల్పడిన వాడు అతను చేసిన కర్మ మాదిరిగానే మాత్రమే శిక్షింపబడుతాడు. అతనిపై శిక్షను అధికం చేయటం జరగదు. మరియు అల్లాహ్ ప్రసన్నతను ఆశిస్తూ సత్కర్మ చేసిన వాడికి ఆచరించిన వాడు పురుషుడైన లేదా స్త్రీ అయిన అతడు అల్లాహ్ పై మరియు ఆయన ప్రవక్తపై విశ్వాసం కనబరచిన వాడై ఉండాలి. ఈ ప్రశంసదగిన గుణాలను కలిగిన వారందరు ప్రళయదినమున స్వర్గములో ప్రవేశిస్తారు. అల్లాహ్ వారికి అందులో వాగ్దానం చేసిన ఫలాలను,ఎన్నటికి అంతము కాని స్థిరమైన అనుగ్రహాలను లెక్క లేనంతగా ఆహారముగా ప్రసాదిస్తాడు.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి