సూరా 40 · జుజ్ 24

Ghafir · 40:28

وَقَالَ رَجُلٌ مُؤْمِنٌ مِنْ آلِ فِرْعَوْنَ يَكْتُمُ إِيمَانَهُ أَتَقْتُلُونَ رَجُلًا أَنْ يَقُولَ رَبِّيَ اللَّهُ وَقَدْ جَاءَكُمْ بِالْبَيِّنَاتِ مِنْ رَبِّكُمْ ۖ وَإِنْ يَكُ كَاذِبًا فَعَلَيْهِ كَذِبُهُ ۖ وَإِنْ يَكُ صَادِقًا يُصِبْكُمْ بَعْضُ الَّذِي يَعِدُكُمْ ۖ إِنَّ اللَّهَ لَا يَهْدِي مَنْ هُوَ مُسْرِفٌ كَذَّابٌ

అప్పుడు తన విశ్వాసాన్ని గుప్తంగా ఉంచిన ఫిర్ఔన్ కుటుంబపు ఒక వ్యక్తి ఇలా అన్నాడు: "ఏమీ? మీరు, 'అల్లాహ్ యే నా ప్రభువు.' అని అన్నందుకు, ఒక వ్యక్తిని చంపగోరుతున్నారా? వాస్తవానికి, అతను మీ ప్రభువు తరఫు నుండి మీ వద్దకు స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చాడు కదా! మరియు ఒకవేళ అతను అసత్యవాది అయితే, అతని అసత్యం అతని మీదనే పడుతుంది! కాని ఒకవేళ అతను సత్యవంతుడే అయితే, అతను హెచ్చరించే (శిక్ష) మీపై పడవచ్చు కదా! నిశ్చయంగా, అల్లాహ్ మితిమీరే అసత్యవాదికి సన్మార్గం చూపడు!"

తఫ్సీర్

మరియు ఫిర్ఔన్ వంశము నుండి అల్లాహ్ పై విశ్వాసముంచిన ఒక వ్యక్తి తన విశ్వాసమును తన జాతి వారి నుండి దాచి ఉంచినవాడు మూసా హత్య గురించి వారు చేసుకున్న దృఢ సంకల్పమును విభేదిస్తూ ఇలా పలికాడు : ఏమీ మీరు ఏ పాపము చేయని ఒక వ్యక్తిని నా ప్రభువు అల్లాహ్ అని చెప్పినంత మాత్రాన చంపేస్తారా ?. వాస్తవానికి అతను తన ప్రభువు వద్ద నుండి పంపించబడ్డ ప్రవక్త అని అతని వాదనలో అతని నిజాయితీ పై సూచించే వాదనలను మరియు ఆధారాలను మీ వద్దకు తీసుకుని వచ్చాడు. ఒక వేళ అతడు అసత్యపరుడని అనుకుంటే అతని అసత్యము యొక్క కీడు అతనిపైనే మరలుతుంది. ఒక వేళ అతడు నిజాయితీపరుడైతే మీకు అతను వాగ్దానం చేసిన శిక్ష నుండి కొంత భాగము తొందరగా మీకు చేరుతుంది. నిశ్ఛయంగా అల్లాహ్ తన హద్దులను అతిక్రమించే వాడిని,తనపై మరియు తన ప్రవక్త పై అబద్దములను అపాదించేవాడికి సత్యము వైపునకు భాగ్యమును కలిగించడు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి