సూరా 40 · జుజ్ 24
Ghafir · 40:25
فَلَمَّا جَاءَهُمْ بِالْحَقِّ مِنْ عِنْدِنَا قَالُوا اقْتُلُوا أَبْنَاءَ الَّذِينَ آمَنُوا مَعَهُ وَاسْتَحْيُوا نِسَاءَهُمْ ۚ وَمَا كَيْدُ الْكَافِرِينَ إِلَّا فِي ضَلَالٍ
తరువాత అతను మా వద్ద నుండి సత్యాన్ని వారి ముందుకు తీసుకొని రాగా వారన్నారు: "ఇతనిని విశ్వసించే వారందరి పుత్రులను చంపండి మరియు వారి స్త్రీలను బ్రతకనివ్వండి." కాని సత్యతిరస్కారుల పన్నాగాలు వ్యర్థమే అవుతాయి.
తఫ్సీర్
మూసా అలైహిస్సలాం వారి వద్దకు తన నజాయితీపై సూచించే ఆధారాలను తీసుకొచ్చినప్పుడు ఫిర్ఔన్ ఇలా పలికాడు : అతని తో పాటు విశ్వసించిన వారి మగ సంతానమును హతమార్చి వారి ఆడవారిని వారికి అవవమానము కొరకు వదిలివేయండి. విశ్వాసపరుల సంఖ్యా బలమును తగ్గించే ఆదేశముతో అవిశ్వాసపరుల కుట్ర మాత్రం నాశనమయింది,వెళ్ళిపోయింది. దాని ఎటువంటి ప్రభావం లేకపోయింది.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి