సూరా 4 · జుజ్ 5
An-Nisa · 4:83
وَإِذَا جَاءَهُمْ أَمْرٌ مِنَ الْأَمْنِ أَوِ الْخَوْفِ أَذَاعُوا بِهِ ۖ وَلَوْ رَدُّوهُ إِلَى الرَّسُولِ وَإِلَىٰ أُولِي الْأَمْرِ مِنْهُمْ لَعَلِمَهُ الَّذِينَ يَسْتَنْبِطُونَهُ مِنْهُمْ ۗ وَلَوْلَا فَضْلُ اللَّهِ عَلَيْكُمْ وَرَحْمَتُهُ لَاتَّبَعْتُمُ الشَّيْطَانَ إِلَّا قَلِيلًا
మరియు వారు (ప్రజల గురించి) ఏదైనా శాంతివార్త గానీ లేదా భయవార్త గానీ వినినప్పుడు, దానిని వ్యాపింపజేస్తారు. అలా చేయకుండా వారు దానిని సందేశహరునికో, లేదా వారిలో నిర్ణయాధికారం గలవారికో తెలియజేసి ఉంటే! దానిని విచారించ గలవారు, వారి నుండి దానిని విని అర్థం చేసుకునే వారు. మరియు ఒకవేళ మీపై అల్లాహ్ అనుగ్రహం మరియు ఆయన కారణ్యమే లేకుంటే మీలో కొందరు తప్ప మిగతా వారందరూ షైతాన్ ను అనుసరించి ఉండేవారు.
తఫ్సీర్
మరియు ఈ కపటులందరికి ముస్లిములకు సంతోషమును కలిగించే విషయం లేదా వారికి భయమునకు,బాధకు గురి చేసే విషయం చేరినప్పుడు వారు దాన్ని బట్టబయలు చేసి,దాన్ని వ్యాపింపజేసేవారు. మరియు ఒక వేళ వారు వేచి ఉండి,విషయమును అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంనకు,సలహా ఇచ్చే వారికి,జ్ఞానం కలవారికి,హితబోధన చేసేవారికి చేర్చి ఉంటే సలహా ఇచ్చేవారు,సంగ్రహించేవారు దాన్ని వ్యాపింపజేయటం అవసరమా లేదా దాన్ని గోప్యంగా ఉంచటం అవసరమా తెలుసుకునేవారు. ఓ విశ్వాసపరులారా ఒక వేళ అల్లాహ్ అనుగ్రహము మరియు ఆయన కారుణ్యము మీపై ఈ కపటులందరు గురిచేస్తున్న వాటి నుండి మిమ్మల్ని పరిరక్షించి ఉండకపోతే మీలో చాలా తక్కువ మంది తప్ప అందరు షైతాను దుష్ప్రేరణలను అనుసరించేవారు.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి