సూరా 4 · జుజ్ 5
An-Nisa · 4:80
مَنْ يُطِعِ الرَّسُولَ فَقَدْ أَطَاعَ اللَّهَ ۖ وَمَنْ تَوَلَّىٰ فَمَا أَرْسَلْنَاكَ عَلَيْهِمْ حَفِيظًا
ఎవడు ప్రవక్తకు విధేయత చూపుతాడో వాస్తవంగా అతడు అల్లాహ్ కు విధేయత చూపినట్లే. మరియు కాదని వెనుదిరిగి పోతే వారిని అదుపులో ఉంచటానికి (కావలివానిగా) మేము నిన్ను పంపలేదు.
తఫ్సీర్
ఎవరైతే ప్రవక్తకు ఆయన ఇచ్చిన ఆదేశములను పాటించి,ఆయన వారించిన వాటికి దూరంగా ఉండి విధేయత చూపుతాడో అతడు నిశ్చయంగా అల్లాహ్ ఆదేశమును స్వీకరించాడు. ఎవరైతే ఓ ప్రవక్తా మీకు విధేయత చూపటం నుండి విముఖత చూపుతాడో అతనిపై మీరు దుఃఖించకండి. మేము మిమ్మల్ని అతనిపై పర్యవేక్షకుడిగా,అతని కర్మల రక్షకుడిగా పంపించలేదు. మేము మాత్రం అతని కర్మను షుమారుచేసి అతని లెక్క తీసుకునేవారము.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి