సూరా 4 · జుజ్ 5
An-Nisa · 4:73
وَلَئِنْ أَصَابَكُمْ فَضْلٌ مِنَ اللَّهِ لَيَقُولَنَّ كَأَنْ لَمْ تَكُنْ بَيْنَكُمْ وَبَيْنَهُ مَوَدَّةٌ يَا لَيْتَنِي كُنْتُ مَعَهُمْ فَأَفُوزَ فَوْزًا عَظِيمًا
మరియు ఒకవేళ మీకు అల్లాహ్ తరఫు నుండి అనుగ్రహమే లభిస్తే! మీకూ అతనికి మధ్య ఏ విధమైన అనురాగబంధమే లేనట్లుగా: "అయ్యో! నేను కూడా వారితో పాటు ఉండి ఉంటే నాకు కూడా గొప్ప విజయ ఫలితం లభించి ఉండేది కదా!" అని తప్పక అంటాడు.
తఫ్సీర్
ఓ ముస్లిములారా ఒక వేళ మీకు అల్లాహ్ వద్ద నుండి ఏదైన సహాయం ద్వారా లేదా యుద్ద ప్రాప్తి ద్వారా అనుగ్రహం కలిగితే ధర్మపోరాటం నుండి వెనుక ఉండిపోయిన ఇతడు మీలో నుండి ఒకడు కానట్లుగా మరియు మీ మధ్య,అతని మధ్య ప్రేమ,సాంగత్యం లేనట్లుగా తప్పకుండా ఇలా పలుకుతాడు : అయ్యో నేను కూడా వారితో పాటు వారి యుద్దంలో ఉంటే బాగుండేది. అప్పుడు నేను కూడా వారు గెలుచుకున్న గొప్పతనమును గెలుచుకునేవాడిని.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి