సూరా 4 · జుజ్ 4
An-Nisa · 4:7
لِلرِّجَالِ نَصِيبٌ مِمَّا تَرَكَ الْوَالِدَانِ وَالْأَقْرَبُونَ وَلِلنِّسَاءِ نَصِيبٌ مِمَّا تَرَكَ الْوَالِدَانِ وَالْأَقْرَبُونَ مِمَّا قَلَّ مِنْهُ أَوْ كَثُرَ ۚ نَصِيبًا مَفْرُوضًا
పురుషులకు వారి తల్లిదండ్రులు మరియు దగ్గరి బంధువులు విడిచిపోయిన దానిలో (ఆస్తిలో) భాగం ఉంది మరియు స్త్రీలకు కూడా వారి తల్లిదండ్రులు మరియు దగ్గరి బంధువులు విడిచిపోయిన దానిలో భాగం ఉంది; అది తక్కువైనా సరే, లేదా ఎక్కువైనా సరే. అది (అల్లాహ్) విధిగా నియమించిన భాగం.
తఫ్సీర్
తల్లిదండ్రులు మరియు సమీపబంధువులు అంటే అన్నదమ్ములు,మరియు మేనమామలు,మరణించిన తరువాత పురుషుల కొరకు అందులో వాటా ఉంది అది తక్కువ లేదా ఎక్కువ కావచ్చు,మరియు వీరంతా వదిలి వెళ్ళిన ఆస్తిలో స్త్రీలకు కూడా -అజ్ఞాన కాలానికి భిన్నంగా-వాటా ఉంటుంది, ఆ కాలంలో స్త్రీలకు మరియు చిన్నపిల్లలకు ఆస్తిహక్కు ఉండేది కాదు,ఈ వాటాలు స్పష్టమైనవి సత్యమైనవి,ఈ వాటాలు అల్లాహ్ తరుపునుండి విధి చేయబడినవి.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి