సూరా 4 · జుజ్ 5

An-Nisa · 4:65

فَلَا وَرَبِّكَ لَا يُؤْمِنُونَ حَتَّىٰ يُحَكِّمُوكَ فِيمَا شَجَرَ بَيْنَهُمْ ثُمَّ لَا يَجِدُوا فِي أَنْفُسِهِمْ حَرَجًا مِمَّا قَضَيْتَ وَيُسَلِّمُوا تَسْلِيمًا

అలా కాదు, నీ ప్రభువు సాక్షిగా! వారు తమ పరస్పర విభేదాల విషయంలో నిన్ను న్యాయనిర్ణేతగా స్వీకరించనంత వరకు మరియు (ఓ ప్రవక్తా!) నీవు ఏ నిర్ణయం చేసినా దానిని గురించి వారి మనస్సులలో ఏ మాత్రం సంకోచం లేకుండా దానికి (యథాతథంగా) శిరసావహించనంత వరకు, వారు (నిజమైన) విశ్వాసులు కాలేరు!

తఫ్సీర్

ఈ కపటులందరు భావించినట్లు విషయం కాదు. ఆ పిదప మహోన్నతుడైన అల్లాహ్ తన స్వయంపై ప్రమాణం చేసి చెబుతున్నాడు వారు తమ మధ్య చెలరేగే విభేదాల్లో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఆయన జీవించి ఉన్నప్పుడు మరియు ఆయన మరణం తరువాత ఆయన ధర్మశాసనమును న్యాయనిర్ణేతగా చేసుకుని ఆ తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీర్పు నుండి సంతుష్టపడేంత వరకు నిజమైన విశ్వాసపరులు కాలేరు. మరియు దాని నుండి వారి హృదయములలో ఎటువంటి ఇబ్బంది గాని,దాని విషయంలో సందేహం గాని కలగకూడదు. మరియు తమ బాహ్యములను,తమ అంతర్గతములను పాటించే విషయంలో పరిపూర్ణంగా అంగీకరించాలి.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి