సూరా 4 · జుజ్ 5

An-Nisa · 4:51

أَلَمْ تَرَ إِلَى الَّذِينَ أُوتُوا نَصِيبًا مِنَ الْكِتَابِ يُؤْمِنُونَ بِالْجِبْتِ وَالطَّاغُوتِ وَيَقُولُونَ لِلَّذِينَ كَفَرُوا هَٰؤُلَاءِ أَهْدَىٰ مِنَ الَّذِينَ آمَنُوا سَبِيلًا

ఏమీ? గ్రంథజ్ఞానంలో కొంతభాగం ఇవ్వబడిన వారిని గురించి నీకు తెలియదా ? వారు జిబ్త్ మరియు తాగూత్ లలో విశ్వాసముంచుతున్నారు. వారు సత్యతిరస్కారులను గురించి: "విశ్వాసుల కంటే, వీరే సరైన మార్గంలో ఉన్నారు." అని అంటారు.

తఫ్సీర్

ఓ ప్రవక్తా అల్లాహ్ జ్ఞానములో నుంచి ఒక భాగమును ప్రసాదించిన యూదుల స్థితి గురించి మీరు తెలుసుకోరా,ఆశ్చర్యపడరా వారు అల్లాహ్ ను వదిలి తాము తయారు చేసుకున్న ఆరాధ్య దైవాలను విశ్వసిస్తున్నారు మరియు ముష్రికులను సంతోషపెట్టటానికి వారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహచరుల కన్న సన్మార్గంపై ఉన్నారని చెప్పేవారు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి