సూరా 4 · జుజ్ 5
An-Nisa · 4:37
الَّذِينَ يَبْخَلُونَ وَيَأْمُرُونَ النَّاسَ بِالْبُخْلِ وَيَكْتُمُونَ مَا آتَاهُمُ اللَّهُ مِنْ فَضْلِهِ ۗ وَأَعْتَدْنَا لِلْكَافِرِينَ عَذَابًا مُهِينًا
ఎవరైతే తాము లోభులై, ఇతరులకు లోభం నేర్పుతారో వారినీ మరియు అల్లాహ్ తన అనుగ్రహంతో ఇచ్చిన దానిని దాచి పెట్టే వారినీ (అల్లాహ్ ప్రేమించడు). మరియు మేము సత్యతిరస్కారుల కొరకు అవమానకరమైన శిక్షను సిద్ధపరచి ఉంచాము.
తఫ్సీర్
మరియు అల్లాహ్ తాను ప్రసాదించిన తన ఆహారములోంచి ఖర్చు చేయటమును విధిగావించిన దాన్ని ఆపేవారిని మరియు దాని గురించి ఇతరులను తమ మాటల ద్వారా తన చేతల ద్వారా ఆదేశించేవారిని ఇష్టపడడు. మరియు వారు అల్లాహ్ తన అనుగ్రహములో నుంచి తమకు ప్రసాదించిన ఆహారమును మరియు జ్ఞానమును,ఇతరవాటిని దాస్తున్నారు. మరియు వారు సత్యమును ప్రజల ముందు బహిర్గతం చేయరు. కాని దాన్ని దాచివేస్తారు. మరియు అసత్యమును బహిర్గతం చేస్తున్నారు. మరియు ఈ లక్షణాలు అవిశ్వాసము యొక్క లక్షణాలు. మరియు నిశ్చయంగా మేము అవిశ్వాసపరుల కొరకు అవమానకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి