సూరా 4 · జుజ్ 5

An-Nisa · 4:31

إِنْ تَجْتَنِبُوا كَبَائِرَ مَا تُنْهَوْنَ عَنْهُ نُكَفِّرْ عَنْكُمْ سَيِّئَاتِكُمْ وَنُدْخِلْكُمْ مُدْخَلًا كَرِيمًا

ఒకవేళ మీకు నిషేధించబడి నటువంటి మహాపాపాలకు మీరు దూరంగా ఉంటే, మేము మీ చిన్నచిన్న దోషాలను మన్నించి, మిమ్మల్ని గౌరవస్థానాల్లోకి ప్రవేశింపజేస్తాము.

తఫ్సీర్

ఓ విశ్వాసపరులారా ఒక వేళ మీరు అల్లాహ్ తో సాటి కల్పించటం,తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపటం,ప్రాణాలు తీయటం,వడ్డీ తినటం లాంటి పెద్ద పాపములకు పాల్పడటం నుండి దూరంగా ఉంటే మేము మీరు పాల్పడే చిన్న పాపములను వాటిని ప్రక్షాళన చేసి మరియు వాటిని తుడిచివేసి మన్నించి వేస్తాము. మరియు మేము అల్లాహ్ వద్ద మిమ్మల్ని గౌరవోన్నత ప్రదేశంలో ప్రవేశింపజేస్తాము. అది స్వర్గము.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి