సూరా 4 · జుజ్ 5

An-Nisa · 4:25

وَمَنْ لَمْ يَسْتَطِعْ مِنْكُمْ طَوْلًا أَنْ يَنْكِحَ الْمُحْصَنَاتِ الْمُؤْمِنَاتِ فَمِنْ مَا مَلَكَتْ أَيْمَانُكُمْ مِنْ فَتَيَاتِكُمُ الْمُؤْمِنَاتِ ۚ وَاللَّهُ أَعْلَمُ بِإِيمَانِكُمْ ۚ بَعْضُكُمْ مِنْ بَعْضٍ ۚ فَانْكِحُوهُنَّ بِإِذْنِ أَهْلِهِنَّ وَآتُوهُنَّ أُجُورَهُنَّ بِالْمَعْرُوفِ مُحْصَنَاتٍ غَيْرَ مُسَافِحَاتٍ وَلَا مُتَّخِذَاتِ أَخْدَانٍ ۚ فَإِذَا أُحْصِنَّ فَإِنْ أَتَيْنَ بِفَاحِشَةٍ فَعَلَيْهِنَّ نِصْفُ مَا عَلَى الْمُحْصَنَاتِ مِنَ الْعَذَابِ ۚ ذَٰلِكَ لِمَنْ خَشِيَ الْعَنَتَ مِنْكُمْ ۚ وَأَنْ تَصْبِرُوا خَيْرٌ لَكُمْ ۗ وَاللَّهُ غَفُورٌ رَحِيمٌ

మరియు మీలో ఎవరికైనా స్వతంత్రులైన ముస్లిం స్త్రీలను, వివాహం చేసుకునే స్తోమత లేకుంటే, అప్పుడు మీ స్వాధీనంలో ఉన్న ముస్లిం లైనటువంటి బానిస స్త్రీలను వివాహమాడవచ్చు. మరియు అల్లాహ్ కు మీ విశ్వాసం గురించి తెలుసు. మీరంతా ఒకే ఒక వర్గానికి చెందిన వారు. (ఒకరి కొకరు సంబంధించిన వారు), అందువల్ల వారి సంరక్షకుల అనుమతితో వారితో వివాహం చేసుకొని, ధర్మప్రకారంగా వారి స్త్రీ శుల్కం (మహ్ర్) ఇవ్వండి. ఇది వారిని వివాహ బంధంలో సురక్షితంగా ఉంచటానికి,స్వేచ్ఛా కామక్రీడలకు దిగకుండా ఉంచటానికి మరియు దొంగచాటు సంబంధాలు ఏర్పరచుకోకుండా ఉంచటానికి (ఆదేశించబడింది). వారు (ఆ బానిస స్త్రీలు) వివాహ బంధంలో రక్షణ పొందిన తరువాత కూడా వ్యభిచారానికి పాల్పడితే, స్వతంత్రులైన స్త్రీలకు విధించే శిక్షలోని సగం శిక్ష వారికి విధించండి. ఇది మీలో పాపభీతి గలవారికి వర్తిస్తుంది. ఒకవేళ మీరు నిగ్రహం పాటిస్తే అది మీకే మంచిది. మరియు అల్లాహ్ క్షమాశీలుడు. అపార కరుణాప్రదాత.

తఫ్సీర్

ఓ పురుషులారా మీలో నుండి ఎవరికైన సంపద తక్కువగా ఉండటం వలన స్వతంత్ర స్త్రీలతో వివాహమాడే స్థోమత లేకపోతే వారు ఇతరులకు చెందిన బానిస స్త్రీలను వివాహం చేసుకోవటం సమ్మతము. ఒక వేళ వారు మీకు కనిపించే వాటిపై విశ్వాసులైతే. మరియు మీ విశ్వాసము యొక్క వాస్తవికత మరియు మీ పరిస్థితుల అంతరంగాల గురించి అల్లాహ్ కు బాగా తెలుసు. మరియు మీరు,వారు ధర్మంలో మరియు మానవత్వంలో సమానులు. కావున మీరు వారితో వివాహం చేసుకోవటమును మానుకోకండి. మీరు వారి యజమానుల అనుమతితో వారితో వివాహం చేసుకోండి. మరియు మీరు వారి మహర్ ను తగ్గించకుండా,వాయిదా వేయకుండా వారికి ఇవ్వండి.ఈ ఆదేశం ఒక వేళ వారు బహిరంగంగా వ్యభిచారానికి పాల్పడని సౌశీల్యవంతులై ఉండి,తమతో వ్యభిచారము కొరకు రహస్యంగా స్నేహ సంబంధాలు ఏర్పరచుకోని వారై ఉంటేనే. వారు వివాహ బంధంలో కట్టుబడినప్పుడు ఆ తరువాత వారు వ్యభిచార అశ్లీల కార్యమునకు ఒడిగడితే అప్పుడు మీరు స్వతంత్రులగు స్త్రీలకు విధించే సగం శిక్ష యాభై కొరడా దెబ్బలు కొట్టడం విధించండి. వారిని రాళ్ళతో కొట్టకండి. వివాహిత స్వతంత్రులైన స్త్రీలు వ్యభిచారం చేసినప్పుడు విధించే దానికి వ్యతిరేకంగా. ఈ ప్రస్తావించబడిన విశ్వాసులైన సౌశీల్యవంతులైన బానిస స్త్రీలతో వివాహం చేసుకోవటం సమ్మతించబడటం, తాను వ్యభిచారంలో పడతానని భయపడేవారికి మరియు స్వతంత్రులైన స్త్రీలతో వివాహం చేసుకునే స్థోమత లేని వారికి వెసులబాటు. అయితే బానిస స్త్రీలతో వివాహం కంటే ఆత్మ నిగ్రహరణ (సహనం) చాలా ముఖ్యం. సంతానమును బానిసత్వం నుండి రక్షించటానికి. మరియు అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్చాత్తాప్పడే వారిని మన్నించేవాడు. వారిపై కరుణించేవాడు. వ్యభిచార భయమున్నప్పుడు స్వతంత్ర స్త్రీలను వివాహం చేసుకునే స్థోమత లేని స్థితిలో వారి కొరకు బానిస స్త్రీలతో వివాహం చేసుకోవటం ధర్మబద్ధం చేయటం ఆయన కరుణలో నుంచే.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి