సూరా 4 · జుజ్ 6

An-Nisa · 4:176

يَسْتَفْتُونَكَ قُلِ اللَّهُ يُفْتِيكُمْ فِي الْكَلَالَةِ ۚ إِنِ امْرُؤٌ هَلَكَ لَيْسَ لَهُ وَلَدٌ وَلَهُ أُخْتٌ فَلَهَا نِصْفُ مَا تَرَكَ ۚ وَهُوَ يَرِثُهَا إِنْ لَمْ يَكُنْ لَهَا وَلَدٌ ۚ فَإِنْ كَانَتَا اثْنَتَيْنِ فَلَهُمَا الثُّلُثَانِ مِمَّا تَرَكَ ۚ وَإِنْ كَانُوا إِخْوَةً رِجَالًا وَنِسَاءً فَلِلذَّكَرِ مِثْلُ حَظِّ الْأُنْثَيَيْنِ ۗ يُبَيِّنُ اللَّهُ لَكُمْ أَنْ تَضِلُّوا ۗ وَاللَّهُ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ

వారు నిన్ను, (కలాలను) గురించి ధార్మిక శాసనం (ఫత్వా) అడుగుతున్నారు. అల్లాహ్ మీకు, కలాలను గురించి, ఈ విధంగా ధార్మిక శాసనం ఇస్తున్నాడని చెప్పు: "ఒక పురుషుడు మరణించి, అతనికి సంతానం లేకుండా ఒక సోదరి మాత్రమే ఉంటే, అతడు విడిచిన ఆస్తిలో ఆమెకు సగం వాటా లభిస్తుంది. పిల్లలు లేక చనిపోయిన సోదరి మొత్తం ఆస్తికి, అతడు (ఆమె నిజ సోదరుడు) వారసుడవుతాడు. అతనికి (మృతునికి) ఇద్దరు సోదరీమణులు ఉంటే, వారిద్దరికీ అతడు వదలిన ఆస్తిలో మూడింట రెండు వంతుల భాగం లభిస్తుంది. ఒకవేళ సోదర సోదరీమణులు (అనేకులుంటే) ప్రతి పురుషునికి ఇద్దరు స్త్రీల భాగానికి సమానంగా వాటా లభిస్తుంది. మీరు దారి తప్పకుండా ఉండటానికి అల్లాహ్ మీకు అంతా స్పష్టంగా తెలుపుతున్నాడు. మరియు అల్లాహ్ కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు.

తఫ్సీర్

ఓ ప్రవక్తా వారు మీతో కలాలా వారసత్వ విషయంలో మీరు వారికి ధార్మిక శాసనం (ఫత్వా) ఇవ్వాలని అడుగుతున్నారు. మరియు అతడు వెనుక తండ్రి మరియు సంతానం లేకుండా మరణించిన వాడు. మీరు ఇలా పలకండి అల్లాహ్ దాని విషయంలో మీకు ఇలా స్పష్టపరుస్తున్నాడు : ఎవరైన వెనుక తండ్రి మరియు సంతానము లేక మరణించి అతనికి సొంత సోదరి కాని లేదా తండ్రి తరపున సోదరి కాని ఉంటే ఆమెకు అతను వదిలిన ఆస్తిలో విధిగా సగ భాగం ఉంటుంది. మరియు అతని సొంత సోదరుడు లేదా తండ్రి తరపున సోదరుడు ఉండి అతనితో పాటు ఆస్తిలో విధిగా వాటా పొందేవాడు లేకపోతే అతడు అతని మొత్తం ఆస్తికి వారసుడవుతాడు. ఒక వేళ అతనితో పాటు ఆస్తిలో విధిగా వాటా పొందేవాడు ఉంటే అతడు అతని తరువాత మిగిలిన దానికి వారసుడవుతాడు. ఒక వేళ సొంత సోదరిమణులు లేదా తండ్రి తరపున సోదరిలు ఎక్కువగా ఉంటే అంటే ఇద్దరు లేక ఇంకా ఎక్కువ ఉంటే వారు ఆస్తిలో విధిగా 2/3 వంతులో వారసులవుతారు. మరియు ఒక వేళ వారిలో సొంత సోదర సోదరీమణులు లేదా తండ్రి తరపున సోదర సోదరీమణులు ఉంటే ఈ నియమం - "ఒక మగాడికి ఇద్దరు స్త్రీలకు ఇచ్చెంత భాగము ఉండును"- ప్రకారం ఆస్తిలో వారసులవుతారు అంటే ఒక స్త్రీకి ఇచ్చే దానికి రెండింత చేసి పురుషునికి ఇవ్వాలి. అల్లాహ్ మీ కొరకు కలాలా మరియు ఇతర వాటి విషయంలో వారసత్వ ఆదేశములను మీరు వాటి విషయంలో అపమార్గమునకు లోను కాకూడదని స్పష్టపరుస్తున్నాడు. మరియు అల్లాహ్ కు ప్రతీది తెలుసు. ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి