సూరా 4 · జుజ్ 6

An-Nisa · 4:171

يَا أَهْلَ الْكِتَابِ لَا تَغْلُوا فِي دِينِكُمْ وَلَا تَقُولُوا عَلَى اللَّهِ إِلَّا الْحَقَّ ۚ إِنَّمَا الْمَسِيحُ عِيسَى ابْنُ مَرْيَمَ رَسُولُ اللَّهِ وَكَلِمَتُهُ أَلْقَاهَا إِلَىٰ مَرْيَمَ وَرُوحٌ مِنْهُ ۖ فَآمِنُوا بِاللَّهِ وَرُسُلِهِ ۖ وَلَا تَقُولُوا ثَلَاثَةٌ ۚ انْتَهُوا خَيْرًا لَكُمْ ۚ إِنَّمَا اللَّهُ إِلَٰهٌ وَاحِدٌ ۖ سُبْحَانَهُ أَنْ يَكُونَ لَهُ وَلَدٌ ۘ لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ وَكَفَىٰ بِاللَّهِ وَكِيلًا

ఓ గ్రంథప్రజలారా! మీరు మీ ధర్మ విషయంలో హద్దుమీరి ప్రవర్తించకండి. మరియు అల్లాహ్ ను గురించి సత్యం తప్ప వేరే మాట పలుకకండి. నిశ్చయంగా, మర్యమ్ కుమారుడైన ఈసా మసీహ్ (ఏసు క్రీస్తు), అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ఆయన (అల్లాహ్) మర్యమ్ వైపునకు పంపిన, ఆయన (అల్లాహ్) యొక్క ఆజ్ఞ (కలిమ) మరియు ఆయన (అల్లాహ్) తరఫు నుండి వచ్చిన ఒక ఆత్మ (రూహ్). కావున మీరు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించండి. మరియు (ఆరాధ్య దైవాలు): "ముగ్గురు!" అని అనకండి. అది మానుకోండి, మీకే మేలైనది! నిశ్చయంగా, అల్లాహ్ ఒక్కడే ఆరాధ్య దైవం. ఆయనకు కొడుకు ఉన్నాడనే విషయానికి ఆయన అతీతుడు. ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా ఆయనకే చెందుతుంది. మరియు కార్యకర్తగా అల్లాహ్ మాత్రమే చాలు.

తఫ్సీర్

ఓ ప్రవక్తా ఇంజీలు వారైన క్రైస్తవులతో మీరు ఇలా పలకండి : మీరు మీ ధర్మ విషయంలో హద్దు మీరకండి. మరియు మీరు ఈసా అలైహిస్సలాం విషయంలో అల్లాహ్ పై సత్యం మాత్రమే పలకండి. మర్యమ్ కుమారుడగు ఈసా మసీహ్ అల్లాహ్ ప్రవక్త మాత్రమే. ఆయన అతన్ని సత్యముతో పంపించాడు. ఆయన అతన్ని జిబ్రయీల్ అలైహిస్సలాం ద్వారా మర్యమ్ కు చేరవేసిన తన వాక్కు ద్వారా సృష్టించాడు. మరియు అది ఆయన మాట అయిన "కున్" అని అంటే అది అయిపోయింది. మరియు అది అల్లాహ్ వద్ద నుండి ఒక ఊదటం దాన్ని జిబ్రయీల్ అలైహిస్సలాం అల్లాహ్ ఆదేశంతో ఊదారు. అయితే మీరు అల్లాహ్ పై మరియు ఆయన ప్రవక్తలందరిపై వారి మధ్య ఎటువంటి బేధభావం లేకుండా విశ్వాసమును కనబరచండి. ఆరాధ్య దైవాలు ముగ్గురు అని మీరు పలకకండి. మీరు ఈ అసత్యపు మరియు తప్పుడు మాటను పలకటం నుండి జాగ్రత్త వహించండి దాని నుండి మీరు జాగ్రత్త వహించటం మీకు ఇహపరాల్లో మేలు కలుగును. నిశ్చయంగా అల్లాహ్ ఒక్కడే ఆరాధ్య దైవం ఆయన సాటికల్పించబడటం నుండి మరియు సంతానం కలిగి ఉండటం నుండి పరిశుద్ధుడు. మరియు ఆయన అక్కరలేనివాడు. భూమ్యాకాశముల మరియు ఆ రెండిటి మధ్య ఉన్నవాటి సామ్రాజ్యాధికారం ఆయనకే చెందుతుంది. ఆకాశముల్లో మరియు భూమిలో ఉన్న వాటికి స్థాపకుడిగా మరియు వారికి కార్యనిర్వాహకుడిగా అల్లాహ్ చాలు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి