సూరా 4 · జుజ్ 6
An-Nisa · 4:165
رُسُلًا مُبَشِّرِينَ وَمُنْذِرِينَ لِئَلَّا يَكُونَ لِلنَّاسِ عَلَى اللَّهِ حُجَّةٌ بَعْدَ الرُّسُلِ ۚ وَكَانَ اللَّهُ عَزِيزًا حَكِيمًا
(మేము) ప్రవక్తలను శుభవార్తలు ఇచ్చేవారిగా మరియు హెచ్చరికలు చేసే వారిగా పంపాము. ప్రవక్తల (ఆగమనం) తరువాత, అల్లాహ్ కు ప్రతికూలంగా వాదించటానికి, ప్రజలకు ఏ సాకూ మిగల కూడదని! మరియు అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, మహా వివేచనాపరుడు.
తఫ్సీర్
మేము వారిని అల్లాహ్ పై విశ్వాసమును కనబరిచే వారికి గౌరవోన్నతమైన ప్రతిఫలము ద్వారా శుభవార్తనిచ్చేవారిగా మరియు ఆయనను అవిశ్వసించే వారికి బాధాకరమైన శిక్ష నుండి భయపెట్టేవారిగా పంపించాము. చివరికి ప్రవక్తలను పంపించిన తరువాత ప్రజలకు వంకలు పెట్టటానికి అల్లాహ్ ముందు ఎటువంటి వాదన లేకుండా ఉండటానికి. మరియు అల్లాహ్ తన రాజ్యాధికారంలో సర్వాధిక్యుడు మరియు తన తీర్పునివ్వటంలో వివేకవంతుడు.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి