సూరా 4 · జుజ్ 6
An-Nisa · 4:162
لَٰكِنِ الرَّاسِخُونَ فِي الْعِلْمِ مِنْهُمْ وَالْمُؤْمِنُونَ يُؤْمِنُونَ بِمَا أُنْزِلَ إِلَيْكَ وَمَا أُنْزِلَ مِنْ قَبْلِكَ ۚ وَالْمُقِيمِينَ الصَّلَاةَ ۚ وَالْمُؤْتُونَ الزَّكَاةَ وَالْمُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ أُولَٰئِكَ سَنُؤْتِيهِمْ أَجْرًا عَظِيمًا
కాని వారిలో పరిపూర్ణమైన జ్ఞానం గలవారు మరియు విశ్వాసులైనవారు, నీపై అవతరింపజేయబడిన దానిని మరియు నీకు పూర్వం అవతరింపజేయబడిన వాటిని విశ్వసిస్తారు. వారు నమాజ్ విధిగా సలుపుతారు, విధిదానం (జకాత్) చెల్లిస్తారు మరియు అల్లాహ్ యందు మరియు అంతిమ దినము నందు విశ్వాసం కలిగి ఉంటారు; ఇలాంటి వారికి మేము గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము.
తఫ్సీర్
కాని యూదుల్లోంచి జ్ఞానంలో పట్టు ఉండి స్థిరంగా ఉన్నవారు మరియు విశ్వసించినవారు ఓ ప్రవక్త అల్లాహ్ మీపై అవతరింపజేసిన ఖుర్ఆన్ ను దృవీకరించేవారు మరియు మీ కన్న మునుపు ప్రవక్తలపై ఆయన అవతరింపజేసిన తౌరాత్,ఇంజీలు లాంటి గ్రంధములను దృవీకరించేవారు మరియు నమాజును నెలకొల్పేవారు మరియు తమ సంపదల నుండి జకాత్ ను చెల్లించేవారు. మరియు అల్లాహ్ ఒక్కడే అని ఆయనకు ఎవరు సాటి లేరని నమ్ముతారు. మరియు ప్రళయదినంపై విశ్వాసమును కనబరుస్తారు. ఈ గుణములతో వర్ణించబడిన వారందరకి మేము తొందరలోనే గొప్ప ప్రతిఫలమును ప్రసాదిస్తాము.
రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి