సూరా 4 · జుజ్ 4
An-Nisa · 4:16
وَاللَّذَانِ يَأْتِيَانِهَا مِنْكُمْ فَآذُوهُمَا ۖ فَإِنْ تَابَا وَأَصْلَحَا فَأَعْرِضُوا عَنْهُمَا ۗ إِنَّ اللَّهَ كَانَ تَوَّابًا رَحِيمًا
మరియు మీలో ఏ ఇద్దరూ (స్త్రీలు గానీ, పురుషులు గానీ) దీనికి (వ్యభిచారానికి) పాల్పడితే వారిద్దరినీ శిక్షించండి. వారు పశ్చాత్తాప పడి తమ ప్రవర్తనను సవరించుకుంటే వారిని విడిచిపెట్టండి. నిశ్చయంగా, అల్లాహ్ యే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణాప్రదాత.
తఫ్సీర్
పురుషులలో ఏ ఇద్దరైనా వ్యభిచారానికి పాల్పడితే వారు వివాహితులైన అవివాహితులైన వారు నిందింపబడి అవమానానికి గురయ్యేలా వారిని నిందించి చేతులతో దండించండి. ఒకవేళ వారు గనక ఆపనిని పూర్తిగా విడిచిపెట్టి తమ కర్మలను సంస్కరించుకుంటే వారిని బాధపెట్టకండి. ఎందుకంటే పాపం పట్ల పశ్చాత్తాప పడేవాడు ఎలాంటి అపరాధం చేయని వానితో సమానం. నిశ్చయంగా అల్లాహ్ పశ్చాత్తాపపడే వారిని కరుణించి క్షమిస్తాడు.ఈ విధమైన శిక్ష తొలికాలపు ఆదేశాలకు సంబంధించినది తరువాత ఈ ఆదేశం రద్దు చేయబడి వ్యభిచరించినవాడు అవివాహితుడైతే కొరడా దెబ్బలు, ఊరు నుండి బహిష్కరణ మరియు వివాహితుడైతే శిలాశిక్ష విధించబడింది.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి