సూరా 4 · జుజ్ 5
An-Nisa · 4:113
وَلَوْلَا فَضْلُ اللَّهِ عَلَيْكَ وَرَحْمَتُهُ لَهَمَّتْ طَائِفَةٌ مِنْهُمْ أَنْ يُضِلُّوكَ وَمَا يُضِلُّونَ إِلَّا أَنْفُسَهُمْ ۖ وَمَا يَضُرُّونَكَ مِنْ شَيْءٍ ۚ وَأَنْزَلَ اللَّهُ عَلَيْكَ الْكِتَابَ وَالْحِكْمَةَ وَعَلَّمَكَ مَا لَمْ تَكُنْ تَعْلَمُ ۚ وَكَانَ فَضْلُ اللَّهِ عَلَيْكَ عَظِيمًا
మరియు (ఓ ప్రవక్తా!) అల్లాహ్ అనుగ్రహం మరియు ఆయన కారుణ్యమే నీపై లేకుంటే, వారిలోని ఒక వర్గం వారు నిన్ను మార్గభ్రష్టత్వానికి గురి చేయగోరారు. కాని వారు తమను తాము తప్ప మరెవ్వరినీ మార్గభ్రష్టులుగా చేయలేరు. మరియు వారు నీ కెలాంటి హానీ చేయలేరు. మరియు అల్లాహ్ నీ పై ఈ గ్రంథాన్ని మరియు వివేకాన్ని అవతరింపజేశాడు. మరియు నీకు తెలియని విషయాలను నీకు నేర్పాడు. మరియు నీ పై ఉన్న అల్లాహ్ అనుగ్రహం చాలా గొప్పది.
తఫ్సీర్
ఓ ప్రవక్తా మీ రక్షణ ద్వారా అల్లాహ్ అనుగ్రహం మీపై ఉండకపోతే తమ స్వయంపై విశ్వాసఘాతకమునకు పాల్పడిన వీరందరిలో నుంచి ఒక వర్గము మిమ్మల్ని సత్యం నుండి తప్పించటానికి పూనుకునేది. అప్పుడు మీరు అన్యాయంతో కూడకున్న తీర్పునిచ్చేవారు. వారు వాస్తవానికి తమ స్వయమును మాత్రమే అపమార్గమునకు లోను చేసుకున్నారు. ఎందుకంటే అపమార్గమునకు లోను చేసే ప్రయత్నం వారు ఏదైతే చేసారో దాని పరిణామం వారిపైనే మరలుతుంది. మరియు అల్లాహ్ మీ పై ఖుర్ఆన్ ను,సున్నత్ ను అవతరింపజేశాడు. మరియు మీకు ఇంతకు ముందు తెలియని సన్మార్గమును,వెలుగును ఆయన మీకు నేర్పించాడు. మరియు దైవదౌత్యముతో,రక్షణతో మీపై ఉన్న అల్లాహ్ అనుగ్రహం ఎంతో గొప్పది.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి