సూరా 39 · జుజ్ 24
Az-Zumar · 39:47
وَلَوْ أَنَّ لِلَّذِينَ ظَلَمُوا مَا فِي الْأَرْضِ جَمِيعًا وَمِثْلَهُ مَعَهُ لَافْتَدَوْا بِهِ مِنْ سُوءِ الْعَذَابِ يَوْمَ الْقِيَامَةِ ۚ وَبَدَا لَهُمْ مِنَ اللَّهِ مَا لَمْ يَكُونُوا يَحْتَسِبُونَ
మరియు ఒకవేళ వాస్తవానికి ఈ దుర్మార్గుల వద్ద భూమిలో ఉన్న సమస్తమూ మరియు దానితో పాటు దానంత (రెట్టింపు) సంపద ఉన్నా పునరుత్థాన దినపు ఘోరశిక్ష నుండి తప్పించుకోవటానికి, వారు దానిని పరిహారంగా ఇవ్వగోరుతారు. ఎందుకంటే! అల్లాహ్ తరఫు నుండి వారి ముందు, వారు ఎన్నడూ లెక్కించనిదంతా ప్రత్యక్షమవుతుంది.
తఫ్సీర్
మరియు ఒక వేళ షిర్కు,పాప కార్యములతో తమ స్వయముపై హింసకు పాల్పడిన వారి కొరకు భూమిలో ఉన్న విలువైన వస్తువులు,సంపదలు ఉంటే దాన్ని వారు మరణాంతరం లేపబడిన తరువాత చూసిన కఠినమైన శిక్షకు పరిహారంగా చెల్లిస్తారు. కాని అది వారి కొరకు ఉండదు. ఒక వేళ అది వారి వద్ద ఉన్నా అది వారి నుండి స్వీకరించబడదు. మరియు వారి కొరకు అల్లాహ్ వద్ద నుండి వారు ఊహించని రకరకాల శిక్షలు బహిర్గతమవుతాయి.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి