సూరా 33 · జుజ్ 22

Al-Ahzab · 33:57

إِنَّ الَّذِينَ يُؤْذُونَ اللَّهَ وَرَسُولَهُ لَعَنَهُمُ اللَّهُ فِي الدُّنْيَا وَالْآخِرَةِ وَأَعَدَّ لَهُمْ عَذَابًا مُهِينًا

నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన సందేశహరునికి బాధ కలిగిస్తారో, వారిని అల్లాహ్ ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా శపిస్తాడు (బహిష్కరిస్తాడు) మరియు ఆయన వారికై అవమానకరమైన శిక్షను సిద్ధపరచి ఉంచాడు.

తఫ్సీర్

నిశ్చయంగా ఎవరైతే అల్లాహ్ ను,ఆయన ప్రవక్తను మాటలతో,చేతలతో బాధను కలిగిస్తారో ఇహలోకములో,పరలోకములో వారిని అల్లాహ్ దూరం చేస్తాడు మరియు తన కారుణ్య విశాలత్వము నుండి వారిని వెలివేస్తాడు. మరియు వారు ఆయన ప్రవక్తకు బాధించి పొందిన దానిపై వారికి ప్రతిఫలంగా ఆయన పరలోకములో అవమానమును కలిగించే శిక్షను వారి కొరకు సిద్ధం చేశాడు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి