సూరా 33 · జుజ్ 22
Al-Ahzab · 33:52
لَا يَحِلُّ لَكَ النِّسَاءُ مِنْ بَعْدُ وَلَا أَنْ تَبَدَّلَ بِهِنَّ مِنْ أَزْوَاجٍ وَلَوْ أَعْجَبَكَ حُسْنُهُنَّ إِلَّا مَا مَلَكَتْ يَمِينُكَ ۗ وَكَانَ اللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ رَقِيبًا
వీరు గాక, ఇతర స్త్రీలు నీకు (వివాహమాడటానికి) ధర్మసమ్మతం కారు. వీరికి బదులుగా కూడా మరెవ్వరినీ భార్యలుగా తీసుకునే అనుమతి కూడా నీకు లేదు - వారి సౌందర్యం నీకు ఎంత నచ్చినా - నీ ఆధీనంలో ఉన్న (బానిస) స్త్రీలు తప్ప! వాస్తవానికి అల్లాహ్ ప్రతి విషయాన్ని గమనిస్తున్నాడు.
తఫ్సీర్
ఓ ప్రవక్తా మీ వివాహ బంధంలో ఉన్న మీ భార్యలు కాకుండా ఇతర స్త్రీలతో మీరు వివాహం చేసుకోవటం మీకు ధర్మసమ్మతం కాదు. మరియు ఇతర స్త్రీలను తీసుకునటానికి వారిని (భార్యలను) విడాకులివ్వటం గాని వారిలో నుండి కొందరిని విడాకులివ్వటం సమ్మతం కాదు. ఒక వేళ మీరు వివాహం చేసుకోదలచిన ఇతర స్త్రీల అందము మీకు నచ్చినా సరే. కాని మీ బానిస స్త్రీలతో ఒక నిర్ధిష్ట సంఖ్యకు పరిమితం కాకుండా మీరు ఆనందమును పొందటం మీ కొరకు సమ్మతమే. మరియు అల్లాహ్ ప్రతీ వస్తువును సంరక్షిస్తున్నాడు. మరియు ఈ ఆదేశము విశ్వాసపరుల తల్లుల యొక్క ఘనతను సూచిస్తున్నవి. నిశ్ఛయంగా వారిని విడాకులివ్వటం, వారిని వివాహం చేసుకోవటము నిషేధించబడినది.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి