సూరా 33 · జుజ్ 22
Al-Ahzab · 33:50
يَا أَيُّهَا النَّبِيُّ إِنَّا أَحْلَلْنَا لَكَ أَزْوَاجَكَ اللَّاتِي آتَيْتَ أُجُورَهُنَّ وَمَا مَلَكَتْ يَمِينُكَ مِمَّا أَفَاءَ اللَّهُ عَلَيْكَ وَبَنَاتِ عَمِّكَ وَبَنَاتِ عَمَّاتِكَ وَبَنَاتِ خَالِكَ وَبَنَاتِ خَالَاتِكَ اللَّاتِي هَاجَرْنَ مَعَكَ وَامْرَأَةً مُؤْمِنَةً إِنْ وَهَبَتْ نَفْسَهَا لِلنَّبِيِّ إِنْ أَرَادَ النَّبِيُّ أَنْ يَسْتَنْكِحَهَا خَالِصَةً لَكَ مِنْ دُونِ الْمُؤْمِنِينَ ۗ قَدْ عَلِمْنَا مَا فَرَضْنَا عَلَيْهِمْ فِي أَزْوَاجِهِمْ وَمَا مَلَكَتْ أَيْمَانُهُمْ لِكَيْلَا يَكُونَ عَلَيْكَ حَرَجٌ ۗ وَكَانَ اللَّهُ غَفُورًا رَحِيمًا
ఓ ప్రవక్తా! నిశ్చయంగా, మేము నీకు: నీవు మహ్ర్ చెల్లించిన నీ భార్యలను మరియు అల్లాహ్ ప్రసాదించిన (బానిస) స్త్రీల నుండి నీ ఆధీనంలోకి వచ్చిన వారిని (స్త్రీలను) మరియు నీతో పాటు వలస వచ్చిన నీ పినతండ్రి (తండ్రి సోదరుల) కుమార్తెలను మరియు నీ మేనత్తల (తండ్రి సోదరీమణుల) కుమార్తెలను మరియు నీ మేనమామల (తల్లిసోదరుల) కుమార్తెలను మరియు నీ పినతల్లుల (తల్లిసోదరీమణుల) కుమార్తెలను; మరియు తనను తాను ప్రవక్తకు సమర్పించుకున్న విశ్వాసిని అయిన స్త్రీని - ఒకవేళ ప్రవక్త ఆమెను వివాహం చేసుకోదలిస్తే ఇతర విశ్వాసుల కొరకు గాక ప్రత్యేకంగా నీ కొరకే - ధర్మసమ్మతం చేశాము. వాస్తవానికి వారి (ఇతర విశ్వాసుల) కొరకు, వారి భార్యల విషయంలో మరియు వారి బానిసల విషయంలో, మేము విధించిన పరిమితులు మాకు బాగా తెలుసు. ఇదంతా మేము నీకు ఏ విధమైన ఇబ్బంది కలుగకుండా ఉండాలని చేశాము. వాస్తవానికి అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత.
తఫ్సీర్
ఓ ప్రవక్తా నిశ్చయంగా మీరు మహర్ చెల్లించిన మీ భార్యలను మీ కొరకు సమ్మతించాము. మరియు మేము ఆ బానిస స్త్రీలను ఎవరినైతే అల్లాహ్ బందీలుగా మీకు ఇచ్చాడో వారిని మీ కొరకు సమ్మతం చేశాము. మరియు మీ పినతండ్రి కుమార్తెలతో నికాహ్ చేయటమును, మీ మేనత్త కుమార్తెలతో నికాహ్ చేయటమును, మీ మేన మామ కుమార్తెలతో నికాహ్ చేయటమును, మీ ఆ పినతల్లులు ఎవరైతే మీతోపాటు మక్కా నుండి మదీనాకు హిజ్రత్ చేశారో వారి కుమార్తెలను నికాహ్ చేసుకోవటమును మేము సమ్మతం చేశాము. మరియు ఎటువంటి మహర్ లేకుండా తన స్వయమును నీ కొరకు సమర్పించుకున్న విశ్వాసపరురాలైన స్త్రీతో ఒక వేళ మీరు చేయదలచుకుంటే నికాహ్ చేసుకోవటమును మీ కొరకు మేము సమ్మతించాము. మరియు నికాహె హిబహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ప్రత్యేకించినది,అది ఉమ్మత్ లో నుండి ఇతరులకు సమ్మతం కాదు. నిశ్ఛయంగా విశ్వాసపరులపై వారి భార్యల విషయంలో మేము ఏమి అనివార్యం చేశామో మాకు తెలుసు. ఎందుకంటే వారు నలుగురు భార్యల కన్నా అతిక్రమించటం వారికి సమ్మతం కాదు. మరియు వారి కొరకు వారి బానిస స్త్రీల విషయంలో మేము ధర్మబద్ధం చేసినదేదో మాకు తెలుసు ఎందుకంటే నిశ్ఛయంగా లెక్కలో ఎటువంటి పరిమితి లేకుండా వారిలో నుండి వారు కోరుకున్న వారితో ప్రయోజనం చెందటం వారి కొరకు కలదు. మరియు మేము ఇతరులకు సమ్మతం చేయనివి ప్రస్తావించబడిన వాటిని మీకు ఎటువంటి ఇబ్బంది,బాధ కలగకూడదని మీ కొరకు సమ్మతం చేశాము. మరియు అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్చాత్తాప్పడిన వారిని మన్నించే వాడు,వారిపై కరుణించేవాడు.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి