సూరా 33 · జుజ్ 22

Al-Ahzab · 33:33

وَقَرْنَ فِي بُيُوتِكُنَّ وَلَا تَبَرَّجْنَ تَبَرُّجَ الْجَاهِلِيَّةِ الْأُولَىٰ ۖ وَأَقِمْنَ الصَّلَاةَ وَآتِينَ الزَّكَاةَ وَأَطِعْنَ اللَّهَ وَرَسُولَهُ ۚ إِنَّمَا يُرِيدُ اللَّهُ لِيُذْهِبَ عَنْكُمُ الرِّجْسَ أَهْلَ الْبَيْتِ وَيُطَهِّرَكُمْ تَطْهِيرًا

మరియు మీరు మీ ఇండ్లలోనే ఉండిండి మరియు పూర్వపు అజ్ఞానకాలంలో అలంకరణను ప్రదర్శిస్తూ తిరిగినట్లు తిరగకండి. మరియు నమాజ్ స్థాపించండి మరియు విధిదానం (జకాత్) ఇవ్వండి మరియు అల్లాహ్ కు ఆయన సందేశహరునికి విధేయులై ఉండండి. (ఓ ప్రవక్త) గృహిణులారా! నిశ్చయంగా, అల్లాహ్ మీ నుండి మాలిన్యాన్ని తొలగించి, మిమ్మల్ని పరిశుద్ధులుగా చేయగోరు తున్నాడు.

తఫ్సీర్

మరియు మీరు మీ ఇండ్లలోనే ఉండండి. అవసరం లేకుండా వాటి నుండి బయటకు రాకండి. మరియు మీరు మీ అందాలను ఇస్లాంకు ముందు స్త్రీలు చేసిన కార్యముతో బహిర్గతం చేయకండి ఎందుకంటే వారు వాటిని మగవారిని మరల్చటానికి (ప్రలోభపెట్టటానికి) చేసేవారు. మరియు మీరు నమాజును పరిపూర్ణంగా పాఠించండి. మరియు మీరు మీ సంపదల నుండి జకాతును చెల్లించండి. మరియు అల్లాహ్ కు,ఆయన ప్రవక్తకు విధేయత చూపండి. పరిశుద్ధుడైన అల్లాహ్ మాత్రం మీ నుండి బాధను,చెడును తొలగించదలచాడు. ఓ అల్లాహ్ ప్రవక్త సతీమణులారా ,ఓ ఆయన ఇంటి వారా మరియు ఆయన మీ మనస్సులను వాటికి ఉన్నత గుణాలను తొడిగించి మరియు వాటిని దిగజారిన గుణాల నుండి ఖాళీ చేసి సంపూర్ణంగా పరిశుద్ధపరచదలచాడు. దాని తరువాత ఎటువంటి మాలిన్యం మిగలదు.

రీడర్‌లో తెరవండి - పూర్తి సూరాను చదవండి

మీ భాషలో తఫ్సీర్

అరబిక్ తఫ్సీర్లు

అనువాదం

వినండి