సూరా 33 · జుజ్ 21
Al-Ahzab · 33:28
يَا أَيُّهَا النَّبِيُّ قُلْ لِأَزْوَاجِكَ إِنْ كُنْتُنَّ تُرِدْنَ الْحَيَاةَ الدُّنْيَا وَزِينَتَهَا فَتَعَالَيْنَ أُمَتِّعْكُنَّ وَأُسَرِّحْكُنَّ سَرَاحًا جَمِيلًا
ఓ ప్రవక్తా! నీవు నీ భార్యలతో ఇలా అను: "ఒకవేళ మీరు ప్రాపంచిక జీవితాన్ని మరియు దాని శోభను కోరుతున్నట్లైతే, రండి నేను మీకు తప్పక జీవన సామాగ్రినిచ్చి, మిమ్మల్ని మంచి పద్ధతిలో విడిచి పెడతాను."
తఫ్సీర్
ఓ ప్రవక్తా మీరు మీ సతీమణులతో వారు ఖర్చుల విషయంలో మీ వద్ద వారికి విస్తరించి ఇవ్వటానికి లేని స్థితిలో మీతో విస్తరణను కోరినప్పుడు ఇలా పలకండి : ఒక వేళ మీరు నాతో ప్రాపంచిక జీవితాన్ని మరియు అందులో ఉన్న ఆడంభరాన్ని కోరుకుంటే నేను విడాకులు ఇవ్వబడిన స్త్రీలు ప్రయోజనం చెందే వాటితో మీకు ప్రయోజనం కలిగిస్తాను. మరియు నేను మీకు ఎటువంటి నష్టమును కలిగించటం గాని ఎటువంటి బాధ కలిగించటం గాని లేని విడాకులిస్తాను.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి