సూరా 33 · జుజ్ 21
Al-Ahzab · 33:20
يَحْسَبُونَ الْأَحْزَابَ لَمْ يَذْهَبُوا ۖ وَإِنْ يَأْتِ الْأَحْزَابُ يَوَدُّوا لَوْ أَنَّهُمْ بَادُونَ فِي الْأَعْرَابِ يَسْأَلُونَ عَنْ أَنْبَائِكُمْ ۖ وَلَوْ كَانُوا فِيكُمْ مَا قَاتَلُوا إِلَّا قَلِيلًا
దాడి చేసిన వర్గాలు ఇంకా వెళ్ళి పోలేదు అనే వారు భావిస్తున్నారు. ఒకవేళ ఆ వర్గాలు తిరిగి మళ్ళీ దాడి చేస్తే! ఎడారి వాసులతో (బద్దూలతో) కలిసి నివసించి అక్కడి నుండి మీ వృత్తాంతాలను తెలుసుకుంటే బాగుండేది కదా! అని అనుకుంటారు. ఒకవేళ వారు మీతో పాటు ఉన్నా చాలా తక్కువగా యుద్ధంలో పాల్గొని ఉండేవారు.
తఫ్సీర్
ఈ పిరికివారందరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో యుద్ధం చేయటానికి,విశ్వాసపరులతో యుద్ధం చేయటానికి సమావేశమైన సమూహాలన్ని విశ్వాసపరులని కూకటివ్రేళ్ళతో తుదిముట్టించనంత వరకు వెళ్ళరని అనుకునేవారు. మరియు ఒక వేళ సమూహాలన్ని రెండవసారి వచ్చారే అనుకోండి ఈ కపట విశ్వాసులందరు మదీనా నుండి వెళ్ళిపోయి పల్లెవాసులతో ఉండదలుస్తారు. మీ సమాచారముల గురించి ఇలా అడుగుతారు : మీ శతృవులతో మీ యుద్ధానంతరం మీకు ఏమి సంభవించినది ?. ఒక వేళ వారు ఓ విశ్వాసపరులారా మీలో ఉంటే వారు మీతోపాటు కలిసి చాలా తక్కువగా యుద్ధం చేస్తారు. మీరు వారినిలెక్క చేయకండి మరియు వారిపై విచారించకండి.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి