సూరా 30 · జుజ్ 21
Ar-Rum · 30:9
أَوَلَمْ يَسِيرُوا فِي الْأَرْضِ فَيَنْظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِينَ مِنْ قَبْلِهِمْ ۚ كَانُوا أَشَدَّ مِنْهُمْ قُوَّةً وَأَثَارُوا الْأَرْضَ وَعَمَرُوهَا أَكْثَرَ مِمَّا عَمَرُوهَا وَجَاءَتْهُمْ رُسُلُهُمْ بِالْبَيِّنَاتِ ۖ فَمَا كَانَ اللَّهُ لِيَظْلِمَهُمْ وَلَٰكِنْ كَانُوا أَنْفُسَهُمْ يَظْلِمُونَ
ఏమీ? వీరు భూమిపై ప్రయాణం చేయలేదా? వీరి పూర్వీకుల గతి ఏమయిందో చూడటానికి? వారు, వీరి కంటే ఎక్కువ బలవంతులుగా ఉండేవారు మరియు వారు భూమిని బాగా దున్నేవారు, సేద్యం చేసేవారు మరియు దానిపై, వీరి కట్టడాల కంటే ఎక్కువ కట్టడాలు కట్టారు మరియు వారి వద్దకు వారి సందేశహరులు, స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చారు. అల్లాహ్ వారి కెలాంటి అన్యాయం చేయలేదు, కాని వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు.
తఫ్సీర్
ఏ వీరందరు వీరికన్న మునుపటి తిరస్కార జాతుల ముగింపు ఏవిధంగా అయినదో యోచన చేయటానికి భూమిలో సంచరించలేదా ?. ఈ జాతుల వారు వీరికన్న ఎక్కువ బలవంతులు. మరియు వారు వ్యవసాయం కొరకు,నిర్మాణం కొరకు దున్నారు. వీరందరు నిర్మించిన వాటి కంటే ఎక్కువగా వారు నిర్మించారు. మరియు వారి వద్దకు వారి ప్రవక్తలు అల్లాహ్ ఏకత్వముపై స్పష్టమైన ఆధారాలను,వాదనలను తీసుకుని వస్తే వారు తిరస్కరించారు. అల్లాహ్ వారిని తుదిముట్టించినప్పుడు వారిని హింసించలేదు. కాని వారే తమ అవిశ్వాసం వలన వినాశన స్థానములకు రావటం వలన తమ స్వయమును హింసించుకున్నారు.
రీడర్లో తెరవండి - పూర్తి సూరాను చదవండి